Aakasamlo Oka Tara | ఆకాశంలో ఒక తార మూవీ పైరసీ.. కేసు నమోదు

ఆకాశంలో ఒక తార సినిమా విడుదలైన తొలిరోజే ఆన్​లైన్​లో ప్రత్యక్షం అయింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Aakasamlo Oka Tara | తెలుగు సినిమాలను పైరసీ భూతం వదలడం లేదు. తాజాగా విడుదలైన ఆకాశంలో ఒక తార మూవీ విడుదలైన రోజే ఆన్​లైన్​లో ప్రత్యక్షం అయింది.

పైరసీతో తెలుగు చిత్ర పరిశ్రమ (Telugu Film Industry)కు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. గతంలో ఐబొమ్మ వెబ్​సైట్​ను పోలీసులు మూసి వేయించారు. దీంతో పైరసీ బెడద కొంత మేర తగ్గింది. అయితే తాజాగా పైరసీ ముఠాలు రెచ్చిపోతున్నాయి. రణబాలి, ఆదర్శ కుటుంబం, కల్ట్ సినిమాలను కర్నూలు సిటీ స్క్వేర్ మాల్ థియేటర్‌లో రహస్యంగా చిత్రీకరించారు.

Aakasamlo Oka Tara | పోలీసులకు ఫిర్యాదు

నాలుగు సినిమాల పైరసీ కాపీలను http://go2.india4moviee.click అనే వెబ్‌సైట్‌లో గుర్తించినట్టు సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Anita Chowdhury Cyber Fraud | టాలీవుడ్ నటి అనితా చౌదరికి సైబర్ టోకరా.. ఏకంగా రూ. 4.14 లక్షలు స్వాహా..!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *