అక్షరటుడే, వెబ్డెస్క్ : Peru Earthquake | పెరూలో భారీ భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం.. శుక్రవారం మధ్య పెరూలోని ఆండీస్ పర్వత శ్రేణులలో 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది.
పెరూ (Peru)లో శుక్రవారం రాత్రి ఈ భూకంపం సంభవించిందని యు.ఎస్. జియోలాజికల్ సర్వే తెలిపింది. దీని కేంద్రం ఆండీస్ పర్వత శ్రేణులలో, జునిన్‌కు ఉత్తరాన 34 కిలోమీటర్ల దూరంలో, 108 కిలోమీటర్ల లోతులో ఉంది. భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికి లోతులో ఉండటంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి నష్టం లేదా ప్రాణనష్టం జరగలేదని పెరూ జియోఫిజికల్ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. పెరూ రాజధానిలో కూడా ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
Peru Earthquake | రింగ్ ఆఫ్ ఫైర్లో..
ప్రపంచంలోని చాలా భూకంపాలు సంభవించే పసిఫిక్ బేసిన్ చుట్టూ ఉన్న 40 వేల కిలోమీటర్ల అగ్నిపర్వతాలు, ఫాల్ట్ లైన్ల వలయమైన “రింగ్ ఆఫ్ ఫైర్” వెంట పెరూ ఉంది. దీంతో ఇక్కడ ఎక్కువగా భూకంపాలు వస్తుంటాయి. ఆగస్టులో పెరూవియన్ ఆండీస్‌లో సంభవించిన 6.7 తీవ్రత గల భూకంపం వల్ల ఇద్దరు వ్యక్తులు గాయపడగా, అనేక ఇళ్లు, ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు దెబ్బతిన్నాయి.
ఇది కూడా చదవండి..: Canada | కెనడాలో భారతీయుడి హత్య