Trump Modi friendship | మోడీ అంటే నాకు చాలా ఇష్టం.. ఐ లవ్ ఇండియా : డోనాల్డ్​ ట్రంప్

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump Modi friendship | అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల (ఇండిపెండెన్స్ డే) సందర్భంగా భారత్ – అమెరికా దేశాల మధ్య ఉన్న దృఢమైన బంధాన్ని చాటిచెప్పేలా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.

దేశ రాజధాని ఢిల్లీలోని అమెరికా రాయబారి కార్యాలయం (U.S. Embassy)లో ఇండిపెండెన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల సందర్భంగా భారత్‌లోని అమెరికా రాయబారి సెర్జియో గోర్ (Sergio Gor) కు ట్రంప్ స్వయంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫోన్ సంభాషణలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై, భారతదేశంపై తనకున్న ప్రత్యేక అభిమానాన్ని ఆయన మరోసారి చాటుకున్నారు.

Trump Modi friendship | మోడీకి నేను పెద్ద అభిమానిని..

రాయబారి సెర్జియో గోర్‌తో ఫోన్‌లో మాట్లాడిన ట్రంప్.. భారత్‌తో ఉన్న ద్వైపాక్షిక సంబంధాల ప్రాధాన్యాన్ని గుర్తుచేసుకున్నారు. “భారత ప్రధాని నరేంద్ర మోడీ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనో గొప్ప వ్యక్తి.. నాకెంతో అత్యంత ఆప్తమయిన స్నేహితుడు. నిజం చెప్పాలంటే భారత ప్రధాని మోడీకి నేను పెద్ద అభిమానిని” అని ట్రంప్ పేర్కొన్నారు.

Trump Modi friendship | ఐ లవ్ ఇండియా..

ప్రధాని మోడీతో ఉన్న స్నేహాన్ని గుర్తుచేసుకోవడంతో పాటు, భారతదేశంపై తనకున్న ప్రేమాభిమానాలను ఆయన వ్యక్తపరిచారు. “నాకు భారత్​ అన్నా, అక్కడి ప్రజలన్నా ఎంతో ఇష్టం. ‘ఐ లవ్ ఇండియా’ (I Love India)” అంటూ ట్రంప్ హృదయపూర్వక వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీలోని అమెరికా రాయబారి కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇరు దేశాల దౌత్య సంబంధాలను, అధినేతల మధ్య ఉన్న సెంటిమెంట్‌ను ఈ వ్యాఖ్యలు మరోసారి స్పష్టం చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Ananya Infra Land Dispute | “రూ.200 కోట్ల భూమిని రూ.10 కోట్లకే రాసివ్వాలని కాంగ్రెస్ ఎంపీ బెదిరింపులు”.. ‘అనన్య ఇన్ఫ్రా’ సంచలన ఆరోపణలు

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *