RTC Bus CC Camera | ప్రయాణికుల రక్షణే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్సుల్లో ‘భరోసా’ పేరిట సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకొచ్చింది.
RTC Bus CC Camera | ప్రత్యేక కంట్రోల్ రూమ్
ఆర్టీసీ బస్సుల్లో జరిగే దొంగతనాలను అరికట్టడానికి, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను నిరంతరం పసిగట్టేందుకు ఈ సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని సర్కారు భావిస్తోంది.
బస్సుల్లో అమర్చిన ఈ కెమెరాల విజువల్స్ అన్నింటినీ ఆర్టీసీ ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షించేలా పూర్తి ఏర్పాట్లు చేశారు.
పైలట్ ప్రాజెక్టుగా ఆదిలాబాద్ జిల్లాలో దీనిని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. తొలి విడతలో భాగంగా ప్రస్తుతం 175 బస్సుల్లో ఈ సీసీ కెమెరాలను బిగించారు.
ఆదిలాబాద్ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో, త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల బస్సుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు.
Varalakshmi Controversial Comments | మగాడు కేవలం ‘స్పేర్ పార్ట్’ మాత్రమేనా?…..


