అక్షరటుడే వెబ్‌డెస్క్: Modi SCO Group Photo | అంతర్జాతీయ వేదికలపై అనుచితంగా వ్యవహరించడంలో పాకిస్తాన్ మరోసారి తన నైజాన్ని చాటుకుంది. కిర్గిస్థాన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సు గ్రూప్ ఫొటో విషయంలో పాక్ తన దుర్బుద్ధిని ప్రదర్శించి నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. సదస్సులో భాగంగా తీసిన గ్రూప్ ఫొటోలో భారత ప్రధాని నరేంద్ర మోడీని తొలగిస్తూ ఫొటోను క్రాప్ చేసి పాక్ పీఎం కార్యాలయం షేర్ చేయడం వివాదాస్పదంగా మారింది.
Modi SCO Group Photo | హైప్ కోసం ఎడిటింగ్ నాటకాలు..
మంగళవారం జరిగిన సదస్సులో మొత్తం 10 దేశాల అధినేతలు కలిసి ఫొటో దిగారు. అయితే పాకిస్తాన్ PMO విడుదల చేసిన ఫొటోలో మోడీతో పాటు మరికొందరిని తొలగించి, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మధ్యలో ఉన్నట్లు ఎడిట్ చేశారు. అంతేకాకుండా, రౌండ్‌టేబుల్ సమావేశానికి సంబంధించిన వీడియోలోనూ ప్రధాని మోదీ ఉన్న భాగాన్ని కత్తిరించి ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. తమ ప్రధానికి ఎక్కువ ప్రాధాన్యత ఉన్నట్లు చూపించేందుకు ఈ వికృత చేష్టలకు పాల్పడ్డారు.
Modi SCO Group Photo | అసలు ఫొటోతో ప్లాన్ రివర్స్..
పాకిస్తాన్ ఆడిన ఈ క్రాపింగ్ నాటకం ఎంతోసేపు నిలవలేదు. ప్రధాని నరేంద్ర మోదీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఒరిజినల్ గ్రూప్ ఫొటోను షేర్ చేశారు. అందులో షెహబాజ్ షరీఫ్ పక్కనే సాధారణ స్థానంలో నిలబడి ఉన్నట్లు స్పష్టంగా బయటపడటంతో పాక్ ప్లాన్ బెడిసికొట్టింది.
Modi SCO Group Photo | నెటిజన్ల ట్రోల్స్..
ఈ దిగజారుడు చేష్టలపై నెటిజన్లు, సీనియర్ జర్నలిస్టులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దౌత్యం ప్రదర్శించాల్సిన వేదికలపై ఇలాంటి ఎడిటింగ్ ట్రిక్స్ ఏంటని ఎద్దేవా చేశారు. మరోవైపు, సదస్సు ప్రసంగంలో ప్రధాని మోదీ ఉగ్రవాదంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని వ్యూహాత్మక ఆయుధంగా వాడుకుంటున్న దేశాలకు ప్రపంచ దేశాలు స్పష్టమైన సందేశం ఇవ్వాలని గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
From the SCO Summit in Bishkek. pic.twitter.com/GDlPpVkSLR
— Narendra Modi (@narendramodi) September 1, 2026
ఇది కూడా చదవండి: Student Protest FIRs | నిరసనకారులపై కేసులు కొట్టేసిన సుప్రీంకోర్టు.. ఆందోళన విరమించిన సీజేపీ