అక్షరటుడే, వెబ్డెస్క్: Telugu Student Death | నల్గొండ జిల్లా (Nalgonda District) మునుగోడుకు చెందిన యువకుడు న్యూయార్క్లో మృతి చెందాడు. ఈరమళ్ల ప్రసాద్, శ్రీకన్య దంపతుల పెద్ద కుమారుడైన సాయితేజ (25) ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు.
Telugu Student Death | వారం క్రితం ఉద్యోగం
సాయితేజకు వారం క్రితం ఉద్యోగం వచ్చింది. ఈ క్రమంలో కారులో ప్రయాణిస్తుండగా.. అతడు ప్రయాణిస్తున్న కారు జింకను ఢీకొని ఆగిపోయింది. వెనక వచ్చిన వాహనాలు వేగంగా వచ్చి సాయితేజ కారును ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఉద్యోగం వచ్చిన వారానికే కుమారుడు మృతి చెందడంతో బోరున విలపిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇది కూడా చదవండి..: Medak job fraud | సచివాలయం ఉద్యోగినంటూ ఘరానా మోసం.. బిల్లులు, ఉద్యోగాల ఆశచూపి రూ.20.70 లక్షలు కాజేసిన యువకుడు!