Lashkar Bonalu | ఆరు నెలల్లో విగ్రహ ప్రతిష్ఠ చేయకపోతే ప్రాణనష్టం : మాతంగి స్వర్ణలత

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం రంగం కార్యక్రమం నిర్వహించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Lashkar Bonalu | సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం రంగం కార్యక్రమం నిర్వహించారు. మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్​ (Ponnam Prabhakar) సైతం పాల్గొన్నారు.

మాతంగి స్వర్ణలత పచ్చికుండపై నిల్చుని భవిష్యవాణి వినిపించారు. ఏ ప్రమాదాలు వచ్చినా ప్రజలను నేను కాపాడుతున్నా అని భవిష్యవాణిలో తెలిపారు. ప్రజల్లో అహంకారం ఎక్కువవుతోంది, తగ్గించుకుంటే మంచిదన్నారు. ఈ ఏడాది తనను బాధపెడుతున్నారు, కంటతడి పెట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహ ప్రతిష్ఠ చేస్తే కోరిన కోరికలు తీరుస్తానని చెప్పారు. ఆరు నెలల్లో విగ్రహ ప్రతిష్ఠ చేయకపోతే ప్రాణనష్టం తప్పదని హెచ్చరించారు.

Lashkar Bonalu | భారీ వర్షాలు

ప్రజలు తన మాటను ఆచరించడం లేదని ఆమె పేర్కొన్నారు. ఈ ఏడాది కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయన్నారు. ప్రజలు జాగ్రతగా ఉండాలని సూచించారు. కుంభవృష్టి వర్షాలే కాదు అగ్ని ప్రమాదాలు కూడా ఉన్నాయన్నారు. ప్రజలు కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉందని తెలిపారు. వావివరుసలు లేకుండా ఘోరాలు చేస్తున్నారు, వారిని నేను వదిలిపెట్టనని హెచ్చరించారు. తనకు సంతోషం లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను సంతోషంతో రాలేదని, కోపంతో వచ్చానన్నారు.

ఇది కూడా చదవండి..: Borabanda Car Accident | బోరబండలో కారు బీభత్సం..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *