Cigarette Price Hike | మళ్లీ పెరిగిన సిగరెట్​ ధరలు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cigarette Price Hike | దూమపానం చేసేవారికి ఐటీసీ (ITC) కంపెనీ షాక్​ ఇచ్చింది. తన బ్రాండ్​ సిగరెట్ల ధరలను భారీగా పెంచింది. ఈ ఏడాది రెండో సారి ధరలను పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది.

ఐటీసీ నిర్ణయం ప్రకారం.. ఒక సిగరెట్ ప్యాకెట్​పై రూ.10 మేర ధరలు పెరగనున్నాయి. తాజా పెంపుతో గోల్డ్ ఫ్లేక్ ప్రీమియం సిగరెట్​ ప్యాకెట్ ధర రూ. 125 నుంచి రూ. 135కి పెరిగింది. జూన్​లో ఐటీసీ ఇదే ప్యాక్​ ధరను రూ.115 నుంచి రూ.125కు పెంచింది. తాజాగా మరోసారి రూ.10 పెంచడంతో దూమపానం చేసేవారి జేబులకు చిల్లు పడనుంది. జూన్​ నుంచి ఇప్పటి వరకు 17.4 శాతం ధరలు పెరిగాయి.

Cigarette Price Hike | ఖర్చులు పెరగడంతో..

అధిక పన్నులు, చట్టబద్ధమైన సిగరెట్ మార్కెట్‌లో అమ్మకాలపై ఒత్తిడితో సహా సిగరెట్ కంపెనీలు ఎదుర్కొంటున్న పెరుగుతున్న సవాళ్ల నేపథ్యంలో ధరలు పెంచినట్లు ఐటీసీ తెలిపింది. ఆపరేటింగ్ ఖర్చులు పెరగడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. పదేపదే ధరలు పెంచడం, డిమాండ్​ను ప్రభావితం చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. కాగా మిగతా సిగరెట్ కంపెనీలు సైతం రేట్లు పెంచనున్నట్లు సమాచారం. ఐటీసీ సిగరెట్​ ధరలు పెంచడంతో ఆ కంపెనీ షేర్లు స్టాక్​మార్కెట్లో 1.5శాతం పెరిగాయి.

ఇది కూడా చదవండి : CII Partnership Summit | ప్రారంభమైన సీఐఐ సదస్సు.. హాజరైన కేంద్ర మంత్రి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *