Mumbai Local Train Attack | లోకల్ ట్రైన్‌లో ఘోరం..‘బ్యాడ్ టచ్’ను నిలదీసిన యువతిపై కీచకుడి ఘాతుకం..

ముంబై నగరానికి జీవనాడిగా పిలువబడే లోకల్ రైళ్లలో మహిళల భద్రతపై మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Mumbai Local Train Attack | ముంబై నగరానికి జీవనాడిగా పిలువబడే లోకల్ రైళ్లలో మహిళల భద్రతపై మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కదులుతున్న రైలులో తనను అసభ్యంగా తాకిన వ్యక్తిని నిలదీసినందుకు, ఓ 20 ఏళ్ల యువతిని దుండగుడు బయటకు తోసేసిన అత్యంత దారుణ ఘటన నవంబర్ 4న నైగావ్ (Naigaon) రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. బాధితురాలు లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తుండగా, ఓ వ్యక్తి ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆ యువతి ధైర్యంగా అతని చర్యను అడ్డుకుని నిలదీసింది.

Mumbai Local Train Attack | తీవ్ర గాయాలు..

యువతి తనను నిలదీయడంతో ఆగ్రహానికి లోనైన నిందితుడు, రైలు నైగావ్ స్టేషన్‌కు చేరుకుంటున్న సమయంలో ఆమెను కదులుతున్న బోగీ నుంచి బలంగా కిందకు తోసేశాడు. దీంతో ఆమె నేరుగా పట్టాలపై పడిపోయింది. ఈ క్రమంలో రైలు చక్రాల కింద నలిగి ఆమె ఎడమ చేయి తెగిపడటంతో పాటు తీవ్ర గాయాలయ్యాయి.

Mumbai Local Train Attack | సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా..

ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే సిబ్బంది, తోటి ప్రయాణికులు అప్రమత్తమై ఆమెను రక్షించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన సమయంలో అక్కడ నెలకొన్న గందరగోళాన్ని ఆసరాగా తీసుకుని 53 ఏళ్ల నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే, భయందర్ ప్రభుత్వ రైల్వే పోలీసులు (GRP) రంగంలోకి దిగి స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించడంతో పాటు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టారు. ఎట్టకేలకు నవంబర్ 9న నైగావ్‌కు చెందిన సదరు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి:  Annapurna Seva Ratham | అన్నపూర్ణ సేవా రథం పోస్టర్​ ఆవిష్కరించిన పీసీసీ చీఫ్

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *