అక్షరటుడే, కామారెడ్డి: Ganja Seizure | కామారెడ్డి (Kamareddy) రైల్వేమార్గం అక్రమార్కులకు వరంగా మారుతోంది. ఇక్కడి యువతను మత్తుకు బానిస చేసేలా నిషేధిత మత్తు పదార్థాలు, గంజాయి సరఫరా చేస్తున్నారు. కామారెడ్డి రైల్వే స్టేషన్లో (Kamareddy Railway Station) మంగళవారం 10 కిలోల ఎండు గంజాయిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు.
Ganja Seizure | నాగావలి ఎక్స్‌ప్రెస్‌లో..
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కుంబలఘర్ నుండి పూణే వెళ్తున్న నాగవల్లి ఎక్స్ ప్రెస్‌లో(Nagavalli Express) అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఇద్దరు వ్యక్తుల వద్ద 10 కిలోల ఎండు గంజాయి లభించింది. పట్టుబడిన ఇద్దరు మహారాష్ట్రలోని జాల్నా జిల్లాకు చెందిన సునీల్, ప్రవీణ్‌గా అధికారులు గుర్తించారు. నిందితులిద్దరు ఒడిస్సాలోని(Odisha) రాయ్ ఘడ్లో ఎండు గంజాయిని కొనుగోలు చేసి మహారాష్ట్రలోని (Maharashtra) రాయ్‌పూర్‌కు చేరవేస్తున్నట్టు ఎక్సైజ్ సీఐ సంపత్ కృష్ణ వెల్లడించారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.5లక్షలు ఉంటుందని, నిందితులిద్దరిని రిమాండ్‌కు తరలించామని తెలిపారు. దాడుల్లో ఎస్సై విక్రమ్ కుమార్, కుమార్, హెడ్ కానిస్టేబుళ్లు జాన్ బల్వంత్‌రావు, ఫరీద్, సిబ్బంది రాజు, పవన్ రెడ్డి, బాబు, శరత్, వందన పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి : Nizampet Dumping Yard | నిజాంపేట డంపింగ్ యార్డ్ తరలిస్తాం : మంత్రి అడ్లూరి
