Sonu Sood | నేపాల్ వరద బాధితులకు సోనూసూద్​ సాయం

ఆకస్మిక వరదల వల్ల తీవ్రంగా ప్రభావితమైన త్రిశూలి బజార్‌ను బాలీవుడ్ నటుడు సోనూ సూద్ బుధవారం సందర్శించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sonu Sood | ఆకస్మిక వరదల వల్ల తీవ్రంగా ప్రభావితమైన పట్టణాల్లో ఒకటైన త్రిశూలి బజార్‌ను బాలీవుడ్ నటుడు సోనూ సూద్ బుధవారం సందర్శించారు. బాధితులకు సహాయక సామగ్రిని పంపిణీ చేయడానికి ఆయన మంగళవారం కాఠ్మండు చేరుకున్నారు.

వరద ప్రభావిత ప్రాంతాలను చూసిన తర్వాత ఆయన మాట్లాడుతూ.. వినాశనం కళ్ల ముందే కనిపిస్తోందన్నారు. గ్రామంలోని మరో వైపు అంతా తుడిచిపెట్టుకుపోయింది, ఆ ప్రాంతానికి వెళ్లడానికి మార్గం కూడా లేదన్నారు. ఇళ్లు, కుటుంబ సభ్యులను కోల్పోయి ఇక్కడ చిక్కుకుపోయిన వారి గురించి ఆలోచిస్తుంటే తన గుండె తరక్కుపోతుందన్నారు. శిథిలాల కింద ఇంకా ప్రజలు చిక్కుకుని ఉన్నారని పేర్కొన్నారు. నేపాల్ (Nepal) మళ్లీ కోలుకుని నిలబడేలా వారికి కొంత సహాయం అందించగలమని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు.

Sonu Sood | మద్దతు కొనసాగించాలి

వరదల సమయంలో భారత ప్రభుత్వం అద్భుతంగా స్పందించిందని తాను భావిస్తున్నట్లు సోనూసూద్​ తెలిపారు. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ కారణమన్నారు. నేపాల్‌కు అందించిన సహాయం ప్రశంసనీయమని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలను కలిసినప్పుడు, ఈ సమస్య కొన్ని వారాలు లేదా నెలల్లో పరిష్కారం కాదని తనకు అర్థమైందన్నారు. వారికి మన మద్దతును కొనసాగించాలని పేర్కొన్నారు. పెద్ద కార్పొరేట్ సంస్థలన్నీ తమ CSR (సామాజిక బాధ్యత) కార్యక్రమాలతో ఇక్కడికి రావాలని కోరారు. కాగా బాధితులకు ఆయన బ్లాంకెట్లు, ఆహారం పంపిణీ చేశారు. ఏ సాయం కావాలన్న తనను సంప్రదించాలని సూచించారు. ఒక్క ఫోన్​ కాల్​ దూరంలో ఉంటానని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Anand Vaishnavi Epic | Baby జోడీ ఆనంద్ – వైష్ణవి మళ్ళీ కలిస్తే.. Epic సరదాల కచేరీ!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *