Har Ghar Tiranga | స్వాతంత్య్ర సమరయోధుల పోరాట స్ఫూర్తితో ‘హర్ ఘర్ తిరంగా’

ప్రతి ఒక్కరు తమ ఇంటిపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Har Ghar Tiranga | స్వాతంత్య్ర సమరయోధుల పోరాట స్ఫూర్తితో దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరు తమ ఇంటిపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ (MLA Dhanpal Suryanarayana) పిలుపునిచ్చారు. సోమవారం నగరంలోని (Nizamabad) మిర్చి కంపౌండ్​లో గల తన ఇంటిపై జెండాను ఎగురవేశారు.

Har Ghar Tiranga | వారి స్ఫూర్తిని నేటి తరానికి అందించేందుకు..

ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం మాదిరిగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగిందన్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో స్వాతంత్య్ర పోరాట యోధుల త్యాగాల స్ఫూర్తిని నేటి తరానికి అందించేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని ఎమ్మెల్యే ధన్​పాల్​ అన్నారు.

ఇది కూడా చదవండి: Sriramsagar Water Storage | ఎస్సారెస్పీకి తగ్గుతున్న వరద.. 42.116 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *