IFMIS Bill Submission | హార్డ్ కాపీలకు పూర్తిగా గుడ్‌బై..15 నుంచి IFMIS ద్వారానే బిల్లులు

అన్ని పత్రాలను Information Technology Act, 2000 నిబంధనలకు అనుగుణంగా చెల్లుబాటు అయ్యే డిజిటల్ సంతకం (Digital Signature)తో ధ్రువీకరించాల్సి ఉంటుంది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: IFMIS Bill Submission | రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో బిల్లుల సమర్పణ ప్రక్రియను పూర్తిగా డిజిటల్ విధానంలోకి తీసుకెళ్లే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రవ్యాప్తంగా Integrated Financial Management and Information System (IFMIS) ద్వారా పేపర్‌లెస్ బిల్లుల సమర్పణ విధానాన్ని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ విధానం అన్ని ప్రభుత్వ శాఖలకు వర్తించనుంది.

IFMIS Bill Submission | డిజిటల్​ సంతకంతో ధ్రువీకరణ..

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు (DDOs) ఇకపై బిల్లులను ఆన్‌లైన్‌లో మాత్రమే సమర్పించాలి. బిల్లుతో పాటు అవసరమైన ఆధార పత్రాలను స్కాన్ చేసి తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుంది.

అలాగే సమర్పించే అన్ని పత్రాలను Information Technology Act, 2000 నిబంధనలకు అనుగుణంగా చెల్లుబాటు అయ్యే డిజిటల్ సంతకం (Digital Signature)తో ధ్రువీకరించాల్సి ఉంటుంది.

Cyber Crime Hyderabad | రోజుకు రూ.కోటి కొట్టేస్తున్న సైబర్​ నేరగాళ్లు

ప్రభుత్వం స్పష్టం చేసిన మేరకు 2026 ఆగస్టు 15 నుంచి ట్రెజరీలు, పే అండ్ అకౌంట్స్ కార్యాలయాలకు హార్డ్ కాపీ బిల్లులను సమర్పించడానికి అవకాశం ఉండదు. ట్రెజరీలు, పే అండ్ అకౌంట్స్ ఆఫీసులు (PAOs), ట్విన్ సిటీస్ పే అండ్ అకౌంట్స్ ఆఫీస్ భౌతిక బిల్లులను స్వీకరించవని పేర్కొంది.

IFMIS Bill Submission | పర్యవేక్షణ బాధ్యత ట్రెజరీ శాఖ అధికారులదే

ఈ ఆదేశాల అమలును కచ్చితంగా పర్యవేక్షించాలని జిల్లా ట్రెజరీ అధికారులకు (DTOs) సూచించింది. తమ పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఈ మార్గదర్శకాలను వెంటనే తెలియజేసి అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

ఈ నిర్ణయంతో బిల్లుల సమర్పణ, పరిశీలన, ఆమోద ప్రక్రియ పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించబడనుంది. దీంతో పారదర్శకత పెరగడంతో పాటు ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

కాగా, ఈ ఉత్తర్వులు ఆర్థిక శాఖ 2026 జూలై 28న జారీ చేసిన మెమోతో పాటు ట్రెజరీల డైరెక్టరేట్ 2026 ఆగస్టు 4న విడుదల చేసిన మెమో ఆధారంగా జారీ చేసినట్లు వెల్లడించింది.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *