అక్షరటుడే, బాన్సువాడ: 22A Land Protest | నస్రుల్లాబాద్ (Nasrullabad) మండల కేంద్రం నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు శనివారం హైదరాబాద్‌కు (Hyderabad) భారీగా తరలివెళ్లారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాధర్నాకు మద్దతుగా వారు కదిలారు.
22A Land Protest | 22ఏ నిషేధిత భూముల జాబితాకు వ్యతిరేకంగా..
ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు చందూరి హన్మండ్లు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే పేద, మధ్యతరగతి ప్రజలకు చెందిన ప్రైవేట్ పట్టా భూములు, ఇళ్లను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చి ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. 22ఏ జాబితాలో భూములు చేరడంతో అత్యవసర పరిస్థితుల్లో వాటిని విక్రయించుకోలేకపోవడంతో పాటు బ్యాంకుల నుంచి రుణాలు పొందలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
గత ధరణి పోర్టల్‌తో పోలిస్తే ప్రస్తుతం అమల్లోకి వచ్చిన భూ భారతి ద్వారా ప్రజల భూములకు సంబంధించిన మరిన్ని వివాదాలు తలెత్తుతున్నాయని ఆయన విమర్శించారు. భూముల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, ఓబీసీ మండల అధ్యక్షుడు సాయిలు, శక్తి కేంద్రాల ఇన్‌ఛార్జ్‌లు నాగరాజు, రవికాంత్, నందు, సాయితేజ, కార్తీక్, బూత్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: దుర్గం చెరుపై KTR ట్వీట్