అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bank Robbery Attempt | అర్ధరాత్రి వేళ బ్యాంకు స్ట్రాంగ్ రూమ్‌ను పగులగొట్టి దోపిడీకి యత్నించిన అంతర్రాష్ట్ర ముఠా ఆటకట్టించారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బ్లూకోల్ట్స్ పోలీసులు.
అప్రమత్తతతో వ్యవహరించి పెద్ద దోపిడీని అడ్డుకున్న సిబ్బందిని నిజామాబాద్ Nizamabad పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఐపీఎస్ ప్రత్యేకంగా ప్రశంసించి, నగదు రివార్డు అందజేశారు.
Bank Robbery Attempt | అర్ధరాత్రి బ్యాంకుపై కన్ను
ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెర్కిట్ ప్రాంతంలో ఉన్న ఇండియన్ బ్యాంక్‌లో శనివారం అర్ధరాత్రి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు దుండగులు చోరీకి యత్నించారు. బ్యాంకు స్ట్రాంగ్ రూమ్‌లోకి చొరబడి నగదు దోచుకునేందుకు ప్లాన్ చేశారు.
Bank Robbery Attempt | స్పాట్లోనే పట్టుకున్న బ్లూకోల్ట్స్
నైట్ పెట్రోలింగ్ విధుల్లో ఉన్న ఆర్మూర్ బ్లూ కోల్ట్స్ సిబ్బంది (ఎస్. నాగరాజు – PC 426, ఎన్. అశోక్ – PC 1937) నిందితుల అనుమానాస్పద కదలికలను గుర్తించారు. తక్షణమే చాకచక్యంగా వ్యవహరించి, బ్యాంకులో చోరీకి యత్నిస్తున్న ముగ్గురు నిందితులను ఘటనా స్థలంలోనే రౌండప్ చేసి పట్టుకున్నారు.
Bank Robbery Attempt | నగదు రివార్డుతో అభినందించిన సీపీ
ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఐపీఎస్ పాల్గొని, సమయస్ఫూర్తితో వ్యవహరించిన బ్లూ కోల్ట్స్ సిబ్బందికి నగదు రివార్డులను అందజేసి అభినందించారు.
బ్యాంకు వంటి కీలక ఆర్థిక సంస్థలో పెద్ద ఎత్తున చోరీ జరగకుండా సకాలంలో స్పందించి అడ్డుకోవడం మెచ్చుకోదగిన విషయమని సీపీ పేర్కొన్నారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా ఉంచాలని సూచించారు.
విధి నిర్వహణలో ప్రతిభ, అంకితభావం కనబరిచే సిబ్బందిని పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందన్నారు. ప్రజల ఆస్తులు, ప్రాణాల రక్షణే పోలీసుల ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, ఆర్మూర్ ఎస్హెచ్ఓ చంద్రశేఖర్ రెడ్డి, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..