అక్షరటుడే, ఇందూరు : OBC National Conference | బెంగళూరులో ఆగస్టు 7న జరగనున్న 11వ ఓబీసీ జాతీయ మహాసభలో బీసీలందరూ తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పిలుపునిచ్చారు. నగరం (Nizamabad)లోని మహాలక్ష్మినగర్లో నిర్వహించిన సమావేశంలో ఆయన పోస్టర్లు, కరపత్రాలు ఆవిష్కరించారు.
OBC National Conference | మండల్ సిఫార్సులు అమలైన సందర్భంగా..
మండల్ సిఫార్సులు అమలై బీసీలకు రిజర్వేషన్లు అందిన రోజు ఆగస్టు 7న ప్రతి ఏడాది ఓబీసీ జాతీయ మహాసభలను నిర్వహిస్తున్నారని బాజిరెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో బీసీలంతా పెద్దఎత్తున పాల్గొని తమ సంఘీభావం తెలపాలన్నారు. మండల్ సిఫార్సుల్లో కేవలం ఒకే సిఫార్సు రిజర్వేషన్లు అమలు అవుతున్నందున ఇంకా బీసీలకు అందాల్సిన ఎన్నో ఫలాలు అందడం లేదన్నారు. బీసీల హక్కుల సాధన కోసం అందరూ సంఘటితం కావాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రతినిధులు ఆకుల ప్రసాద్, దర్శనం దేవేందర్, కరిపే రవీందర్, కొయ్యాడ శంకర్, శ్రీలత, చంద్రకాంత్, అపర్ణ, బాలన్న తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Sirnapalli Cheruvu | జలసిరితో మెరిసిన ‘సిర్నాపల్లి’.. పరవళ్లు తొక్కుతున్న అలుగు అందాలు