Abhishek Banerjee | టీఎంసీ ఎంపీ అభిషేక్​ బెనర్జీ ఇంటి వద్ద అధికారుల కూల్చివేతలు

టీఎంసీ ఎంపీ అభిషేక్​ బెనర్జీ ఇంటి వద్ద తాత్కాలిక షెడ్డును అధికారులు తొలగించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Abhishek Banerjee | కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ (KMC) అధికారులు గురువారం ఉదయం తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ అభిషేక్ బెనర్జీ నివాసం ముందు ఉన్న ఒక తాత్కాలిక నిర్మాణాన్ని తొలగించారు. బుల్డోజర్‌తో కలిసి కాళీఘాట్‌లోని ఎంపీ నివాసానికి చేరుకుని, అక్కడ వెదురుతో నిర్మించిన ఒక నిర్మాణాన్ని తొలగించారు.

ఈ నిర్మాణం ఫుట్‌పాత్‌పై ఉండటంతో స్థానికులకు ఇబ్బందులు కలుగుతున్నాయని మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు. బుల్డోజర్‌తో కూల్చివేత చర్యలకు ముందే, ఎంపీ నివాసం వద్ద భారీగా కేంద్ర బలగాలను మోహరించారు. ఎంపీ పుట్టినరోజు సందర్భంగా ఇటీవల ఆయన నివాసం వద్ద బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో తనపై దాడి చేశారని ఎంపీ ఆరోపించారు. ఈ క్రమంలో తాజాగా ఆయన నివాసం వద్ద నిర్మాణాన్ని కూల్చివేయడం గమనార్హం.

Abhishek Banerjee | పలువురికి గాయాలు

పుట్టిన రోజు సందర్భంగా జరిగిన గొడవలో ఇరువర్గాలకు చెందిన వారు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీ నివాసంపై జరిగిన దాడిని పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఖండించారు. “ధైర్యం ఉంటే నాపైనే మీ బుల్డోజర్లను ప్రయోగించండి” అని బీజేపీకి ఆమె సవాల్​ విసిరారు. కాగా ఎంపీ నివాసం వద్ద అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసే సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులు మోహరించారు.

దీనిని కూడా చదవండి : Bike Tractor Accident | కంజరలో రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్​ బైక్ ఢీ​కొని ఇద్దరు మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *