అక్షరటుడే, వెబ్డెస్క్ : CMC Demolitions | అక్రమ నిర్మాణాలపై సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలను కూల్చివేస్తున్నారు. 10 రోజుల్లో ఏకంగా 154 భవనాలు కూల్చేశారు.
గచ్చిబౌలి అంజయ్య నగర్ (Anjaiah Nagar)లో ఇటీవల ఓ ఏడంతస్తుల భవనం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. 50 గజాల తక్కువ స్థలంలో 7 అంతస్తుల భవనం కట్టడం, నాలాను ఆక్రమించి నిర్మాణం చేపట్టడంతో అది కూలిపోయింది. దీంతో కార్పొరేషన్ అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. నిత్యం ఆయా కాలనీల్లో పర్యటిస్తూ.. అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలను గుర్తిస్తున్నారు. యజమానులకు నోటీసులు అందించి, వాటిని కూల్చి వేస్తున్నారు.
CMC Demolitions | 25 భవనాలు..
సీఎంసీ అధికారులు బుధవారం 25 అక్రమ నిర్మాణాలను కూల్చి వేశారు. మరో 21 అక్రమ నిర్మాణాలను గుర్తించారు. అందులో నాలుగింటికి నోటీసులు అందించారు. గుర్తింపు దశ నుండి చర్యలు తీసుకునే వరకు, మూడు జోన్లలోనూ బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు.
CMC Demolitions | ఆగస్టు 24 నుంచి..
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) అధికారులు ఆగస్టు 24 నుండి సెప్టెంబర్ 2 వరకు 10 రోజుల్లోనే 154 అనధికారిక భవనాలను కూల్చివేశారు. ఇందులో అత్యధికంగా శేరిలింగంపల్లి జోన్లో 69 భవనాలను కూల్చివేయగా, కుత్బుల్లాపూర్ జోన్లో 52 భవనాలు, కూకట్పల్లి (Kukatpally) జోన్లో 33 భవనాలు ఉన్నాయి. శేరిలింగంపల్లి పరిధిలో నార్సింగి సర్కిల్లో అత్యధికంగా 28 భవనాలు, మియాపూర్లో 15 భవనాలను కూల్చివేశారు.
CMC Demolition Drive | Today’s Update
Teams continued inspections and enforcement to address unauthorized constructions and ensure compliance with building regulations.
🔹 21 unauthorized constructions identified
🔹 25 demolitions carried out
🔹 4 notices servedZone-wise… pic.twitter.com/BzfEDdlvRT
— Cyberabad Municipal Corporation (@CMC_Offcl) September 2, 2026
దీనిని కూడా చదవండి : Krishna Janmashtami 2026 | శ్రీకృష్ణాష్టమి సెప్టెంబర్ 4 లేదా 5? తిథి, ముహూర్త సమయాలు ఇవే!