తెలంగాణKishan Reddy Letter | సీఎం రేవంత్​రెడ్డికి కేంద్రమంత్రి కిషన్​రెడ్డి లేఖ

Kishan Reddy Letter | సీఎం రేవంత్​రెడ్డికి కేంద్రమంత్రి కిషన్​రెడ్డి లేఖ

ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి లేఖ రాశారు. చర్లపల్లి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల అప్రోచ్ రోడ్లు విస్తరించాలని కోరారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kishan Reddy Letter | ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (CM Revanth Reddy)కి కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి లేఖ రాశారు. చర్లపల్లి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల అప్రోచ్ రోడ్ల విస్తరణ, భూసేకరణ గురించి ప్రస్తావించారు.

హైదరాబాద్ (Hyderabad) నగరంలో పెరుగుతున్న రద్దీ దృష్ట్యా కొత్తగా అందుబాటులోకి వచ్చిన చర్లపల్లి టెర్మినల్, పునరాభివృద్ధి చెందుతున్న సికింద్రాబాద్ స్టేషన్ వద్ద మౌలిక సదుపాయాల కల్పన అత్యవసరం అని కిషన్​రెడ్డి (Kishan Reddy) పేర్కొన్నారు. గతంలో పలుమార్లు విన్నవించినా పనులు ప్రారంభం కాలేదన్నారు. FCI గోడౌన్ రోడ్డు నుండి కొత్త స్టేషన్ వరకు రహదారిని 200 అడుగులకు విస్తరించాలని కోరారు. భరత్ నగర్ వైపు ఉన్న 30 అడుగుల రోడ్డును, EC నగర్ నుంచి MMTS ప్లాట్‌ఫాం వైపు ఉన్న రోడ్డును విస్తరించాలన్నారు.

Kishan Reddy Letter | భూమి కేటాయించాలి

చర్లపల్లి రైల్వే స్టేషన్​ (Charlapalli Railway Station)లో పార్కింగ్ ఇతర అవసరాల కోసం కొత్త బిల్డింగ్ వైపు 3 ఎకరాలు, MMTS వైపు 2.70 ఎకరాల భూమి కేటాయించాలని కేంద్ర మంత్రి కోరారు. రైల్వే శాఖ ఇప్పటికే రూ. 4 కోట్లు జమ చేసినందున, స్టేషన్‌కు నీటి కనెక్షన్ త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

Kishan Reddy Letter | సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో..

సికింద్రాబాద్ స్టేషన్ (Secunderabad Station)​లో ప్రయాణికుల రాకపోకలకు వీలుగా ఆల్ఫా హోటల్ నుంచి రథీఫైల్ బస్టాండ్ వరకు ఉన్న రహదారిని 120 అడుగులకు విస్తరించాన్నారు. ఈ విషయమై గతంలో సైతం సీఎంకు లేఖ రాసినట్లు కిషన్​రెడ్డి గుర్తు చేశారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం పనులు చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో వ్యక్తిగతంగా చొరవ చూపించి, నగరానికి ఎంతో అవసరమైన చర్లపల్లి రైల్వేస్టేషన్​కు ఇరువైపులా అప్రోచ్ రోడ్ల విస్తరణ, పార్కింగ్ తదితర అవసరాల నిమిత్తం అవసరమైన భూమి కేటాయింపు, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అప్రోచ్ రోడ్డు విస్తరణకు అన్ని రకాల సహాయ సహకారాలను తక్షణమే అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇది కూడా చదవండి..: KTR Leadership | గులాబీ శ్రేణుల ‘తారక’మంత్రం.. బీఆర్ఎస్ సుప్రీం లీడర్‌గా కేటీఆర్‌కు గ్రీన్ సిగ్నల్

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....