భక్తిArunachalam Girivalam | అరుణాచలంలో చిత్ర పౌర్ణమి వేడుకలు.. గిరి ప్రదక్షిణకు ముహూర్తం ఖరారు!

Arunachalam Girivalam | అరుణాచలంలో చిత్ర పౌర్ణమి వేడుకలు.. గిరి ప్రదక్షిణకు ముహూర్తం ఖరారు!

ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయం చిత్ర పౌర్ణమి వేడుకలకు ముస్తాబైంది.

అక్షరటుడే, అరుణాచలం: Arunachalam Girivalam |  ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయం (Arunachaleswara Temple) చిత్ర పౌర్ణమి వేడుకలకు ముస్తాబైంది. ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా జరిగే ఈ వేడుకల్లో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో భక్తులు గిరి ప్రదక్షిణ (Giri Pradakshina) చేసేందుకు ఆలయ యంత్రాంగం శుభ ముహూర్తాన్ని ప్రకటించింది.

Arunachalam Girivalam | గిరి ప్రదక్షిణ సమయం ఇదే..

ఆలయ అధికారుల ప్రకటన ప్రకారం.. చిత్ర పౌర్ణమి గిరి ప్రదక్షిణ సమయం ఏప్రిల్ 30 (గురువారం) రాత్రి 9:52 గంటలకు ప్రారంభమై, మరుసటి రోజు మే 1 (శుక్రవారం) రాత్రి 11:08 గంటలకు ముగుస్తుంది. ఈ సమయంలో భక్తులు 14 కిలోమీటర్ల మేర ఉన్న గిరి మార్గంలో ప్రదక్షిణ చేసి తమ మొక్కులు తీర్చుకోవచ్చని సూచించారు.

Arunachalam Girivalam | ప్రత్యేక పూజలు, అభిషేకాలు:

మే 1వ తేదీ శుక్రవారం రోజు చిత్తరై మాస పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయంలో విశేష పూజలు నిర్వహించనున్నారు. తెల్లవారుజామునే ఆలయ ద్వారాలు తెరిచి, అరుణాచలేశ్వరుడికి, ఉన్నామలై అమ్మవారికి పాలు, పెరుగు, పన్నీరు, తేనె, పంచామృతాలతో మహా అభిషేకం చేస్తారు. అనంతరం స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక ఆరాధనలు నిర్వహిస్తారు.

భారీ ఏర్పాట్లు : ఈ సంవత్సరం చిత్ర పౌర్ణమికి సుమారు 30 లక్షల మందికి పైగా భక్తులు తరలివస్తారని జిల్లా యంత్రాంగం అంచనా వేస్తోంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గిరి మార్గంలో తాగునీరు, ప్రాథమిక వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారు. భారీ బందోబస్తు మధ్య భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రవాణా సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు.

ఇది కూడా చదవండి..: April 30 Horoscope | సమాజంలో పెరగనున్న కీర్తి ప్రతిష్ఠలు.. ఈ రాశుల వారి వ్యక్తిత్వానికి ఫిదా అవ్వాల్సిందే!

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Scientific Farming Methods | శాస్త్రీయ పద్ధతులు పాటించడం ద్వారానే లాభదాయకమైన దిగుబడులు

అక్షరటుడే, భీమ్​గల్ (ముచ్కూర్): Scientific Farming Methods | వ్యవసాయంలో శాస్త్రీయ...

Telangana Advisors | ‘సలహాదారుల’తో ఖజానాకు భారం.. అప్పుల రాష్ట్రంలో అదనపు ఖర్చు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Telangana Advisors | తెలంగాణ (Telangana)లో సలహాదారుల సంఖ్య...

Rajnath Singh Statement | భారత్ ఐటీ హబ్ అయితే.. పాక్ ఉగ్రవాదానికి హబ్ : రాజ్‌నాథ్ సింగ్

అక్షరటుడే, వెబ్​డెస్క్: Rajnath Singh Statement | భారత సాయుధ దళాల...

Mupkal Bus Stand | బస్​ షెల్టర్​ సొంతంగా నిర్మించిన గ్రామస్తులు.. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత

అక్షరటుడే, భీమ్​గల్: Mupkal Bus Stand | బాల్కొండ నియోజకవర్గం (Balkonda...