అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ganja Smuggling | తన ప్రియురాలికి బర్త్ డే సందర్భంగా ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చేందుకు ఓ యువకుడు గంజాయి రవాణాకు పాల్పడ్డాడు. ప్రియురాలితో కలిసి బైక్‌పై గంజాయి తీసుకొస్తూ పోలీసులకు చిక్కాడు.
పెద్దపల్లికి చెందిన మిత్ర చైతన్య (21), హేమలత (20) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. నిందితులు ఒడిశా నుండి హైదరాబాద్ (Hyderabad)కు గంజాయిని తరలిస్తుండగా ‘ఈగిల్ ఫోర్స్’, వైరా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బర్త్ డే సందర్భంగా తన ప్రియురాలికి ఐఫోన్ కొనివ్వాలనే ఉద్దేశంతో ఒడిశా వెళ్లి 12 కిలోల గంజాయిని సేకరించి, దానిని విక్రయించేందుకు హైదరాబాద్‌కు తీసుకు వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
Ganja Smuggling | ఒడిశాలో ఐదు రోజులు
నిందితులు ఒడిశాలోని పసుపులంకకు వెళ్లి అక్కడ సుమారు ఐదు రోజుల పాటు ఉన్నారు. భగవాన్ హంతల్ అనే సరఫరాదారు నుండి రూ.16,000 వెచ్చించి 12 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. దానిని హైదరాబాద్‌లో అధిక ధరకు విక్రయించాలని ప్లాన్ వేశారు. దారకొండ, గుర్తేడు, మారేడుమిల్లి, రాజమండ్రి, సత్తుపల్లి మీదుగా వైరాకు చేరుకునే మార్గంలో వారు ప్రయాణించారు.
Ganja Smuggling | పోలీసులను ఢీకొట్టి
వైరా రింగ్ సెంటర్ వద్ద పోలీసులు వారిని ఆపేందుకు యత్నించారు. అయితే నిందితులు బైక్ ఆపకుండా పోలీసు సిబ్బందిని, వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో ఒక సబ్-ఇన్‌స్పెక్టర్ గాయపడగా, బైక్ పైనుంచి కింద పడటంతో నిందితులు ఇద్దరికీ కూడా గాయాలయ్యాయి. పోలీసులు సుమారు రూ.6 లక్షల విలువైన 12 కిలోల గంజాయిని, ఒక పల్సర్ మోటార్‌సైకిల్‌ను, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి..: IndiGo Flight Accident | ఎయిర్‌పోర్టులో స్తంభాన్ని ఢీకొన్న విమానం