అక్షరటుడే, వెబ్డెస్క్: IndiGo Flight Accident | శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో పెను ప్రమాదం తప్పింది. ఇండిగో విమానం పార్కింగ్ చేస్తుండగా ఎయిర్పోర్ట్లోని స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో విమానం ముందు భాగం దెబ్బతింది.
శ్రీనగర్ విమానాశ్రయంలో పార్కింగ్ చేస్తుండగా ఇండిగో విమానం (IndiGo Flight) ఒక నిలువు లోహపు స్తంభాన్ని ఢీకొనడంతో అది పక్కకు ఒరిగిపోయింది. నవీ ముంబై నుంచి శ్రీనగర్కు వెళ్తున్న ఈ విమానం ఉదయం 9 గంటలకు విమానాశ్రయంలో ఆగుతుండగా ప్రమాదానికి గురైంది. ఫ్లైట్ సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత, పార్కింగ్ చేస్తుండగా ఒక పార్కింగ్ స్టాండ్ స్తంభాన్ని ఢీకొందని విమానయాన సంస్థ ఒక తెలిపింది.
IndiGo Flight Accident | తప్పిన ప్రమాదం
ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారు. విమానంలోని మాన్యువల్ మెట్లను ఉపయోగించి ప్రయాణికులను, సిబ్బందిని సురక్షితంగా కిందకు దించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఇండిగో తెలిపింది. తమ వినియోగదారులు, సిబ్బంది భద్రత, రక్షణే తమకు అత్యంత ప్రాధాన్యమని విమానయాన సంస్థ స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి..: GSLV-F17 Launch | జీఎస్ఎల్వీ ఎఫ్–17 ప్రయోగం విజయవంతం.. మోదీ ప్రశంసలు