Manipur Earthquake | మణిపూర్​లో భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Manipur Earthquake | మణిపూర్ (Manipur)​లో మంగళవారం తెల్లవారుజామున భూకంపం చోటు చేసుకుంది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (NCS) ప్రకారం, 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 5:50 గంటలకు ఈ ప్రకంపనలు సంభవించాయి. దీని కేంద్రం కామ్‌జాంగ్‌ (Kamjang)లో ఉంది.

భూకంపం భూ ఉపరితలం నుంచి 62 కిలోమీటర్ల లోతులో సంభవించింది. దీంతో ప్రభావం తక్కువగా ఉంది. పెద్ద నష్టం, ప్రాణనష్టం జరిగినట్లు తక్షణ నివేదికలు లేవని అధికారులు తెలిపారు. అయితే ప్రకంపనలు మోస్తరుగా ఉన్నప్పటికీ ప్రజలు నిద్రలో నుంచి లేచి బయటకు పరుగులు తీశారు.

Manipur Earthquake

Manipur Earthquake | మయన్మార్​లో..

భారత్-మయన్మార్ సరిహద్దు సమీపంలోని భూకంప కేంద్రం ఉండటంతో మయన్మార్​లో సైతం ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. మయన్మార్‌లో ఉదయం 5.38 గంటలకు 4.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. సోమవారం ఈశాన్య, ఉత్తర జపాన్‌లో 7.5 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. దీంతో అధికారులు సునామీ హెచ్చరిక సైతం జారీచేశారు. వరుస భూకంపాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఇది కూడా చదవండి..: Tamil Nadu Election | తమిళనాడులో నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *