Ganesh Immersion Security | గణేష్​ నిమజ్జనం సందర్భంగా 22న వైన్​షాప్​లు బంద్​.. సీపీ సాయిచైతన్య

గణేష్ నిమజ్జనం నేపథ్యంలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని వైన్స్ షాపులు బంద్ నిర్వహిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సాయిచైతన్య వెల్లడించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Ganesh Immersion Security | గణేష్ నిమజ్జనం నేపథ్యంలో (Nizamabad Police) శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని వైన్స్ షాపులు బంద్ నిర్వహిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సాయిచైతన్య (CP Saichaitanya) వెల్లడించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

Ganesh Immersion Security | శాంతిభద్రతల నేపథ్యంలో..

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో సెక్షన్ 20(1) తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్ 1968 ప్రకారం వైన్స్​ షాప్​లు బంద్​ చేస్తున్నట్లు సీపీ తెలిపారు. అలాగే జిల్లాలోని కల్లు దుకాణాలు, ఐఎంఎల్​ షాప్స్​, బార్లు, క్లబ్బులు, కల్లుడిపోలు 22వ తేదీ ఉదయం 6గంటల నుంచి 23వ తేదీ ఉదయం 6గంటల వరకు బంద్​ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Ganesh Immersion Security | గణేష్ శోభయాత్రకు 1300 మందితో బందోబస్తు

గణేష్ నిమజ్జనోత్సవానికి 1300 మంది సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని సీపీ సాయి చైతన్య తెలిపారు. గణేష్ నిమజ్జనోత్సవ శోభయాత్ర శాంతియుతంగా సజావుగా నిర్వహించేదుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. అన్ని డివిజన్ పరిధిలలో ప్రధాన నిమజ్జన మార్గాల్లో దాదాపు 1300 మందికి పైగా పోలీస్ సిబ్బందిని నియమించామని, సీసీ కెమెరాల ద్వారా డ్రోన్ కెమెరాలలతో పర్యవేక్షణ, ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాట్లు పోలీస్ సిబ్బందితో పాటు ఎక్సైజ్ శాఖ, ఫారెస్టు శాఖ, ఎన్​సీసీ, ఎన్​ఎస్​ఎస్​తో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

Ganesh Immersion Security | శోభయాత్రలో తప్పనిసరి..

నిమజ్జన ఊరేగింపులో శాంతియుతంగా పాల్గొనాలని సీపీ తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ట్రాఫిక్ నియమాలు అందరూ పాటించాలన్నారు. ఆడియో సిస్టమ్స్ నిర్ణీత స్థాయిలో ఉపయోగించాలని కోరారు. డీజేలు పూర్తిగా నిషేధమన్నారు. అత్యవసర సమయాల్లో 112కు, పోలీస్ కంట్రోల్ రూం 87126-59700లో సంప్రదించాలన్నారు.

ఇది కూడా చదవండి: రైతులు నీళ్లు అడిగితే… అరెస్టులా?: రేవంత్ పై కేటీఆర్ ఫైర్ 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *