Nizamabad ACB Trap | పెన్షన్​ కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన మున్సిపల్​ ఉద్యోగులు

లంచం తీసుకుంటూ ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nizamabad ACB Trap | నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ కార్యాలయంలో సోమవారం ఏసీబీ (ACB) అధికారులు సోదాలు చేశారు. లంచం తీసుకుంటుండగా ఓ జూనియర్​ అసిస్టెంట్​, ఔట్​ సోర్సింగ్ ఉద్యోగిని రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

మున్సిపల్​ కార్పొరేషన్​ కార్యాలయంలో పాల్దా అశోక్ జూనియర్ అసిస్టెంట్ (ఎస్టాబ్లిష్‌మెంట్ సెక్షన్)గా, కలకంట్ల కిరణ్ కుమార్ ఔట్​ సోర్సింగ్ ఉద్యోగి (ఆడిట్ సెక్షన్)గా పని చేస్తున్నారు. ఓ మహిళకు సంబంధించిన పెన్షన్ మంజూరు కోసం ఆమె సర్వీస్ బుక్‌లో ఇంక్రిమెంట్ ప్రొసీడింగ్స్ తయారు చేసి, అవసరమైన ఎంట్రీలు, ఇతర వివరాలను నమోదు చేయడం కోసం ఇద్దరు ఉద్యోగులు రూ.15 వేల లంచం డిమాండ్​ చేశారు. దీంతో ఆ మహిళ కుమారుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

Nizamabad ACB Trap | వల పన్ని..

జూనియర్ అసిస్టెంట్​ అశోక్​, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కిరణ్​కుమార్​ సోమవారం నగరంలోని రాజారాజేంద్ర చౌరస్తా సమీపంలో ఉన్న సీతారామ్‌నగర్ కాలనీలోని పద్మశాలి సంఘం వద్ద ఫిర్యాదుదారుడి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. అనంతరం కార్పొరేషన్​ కార్యాలయంలో సోదాలు చేశారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్ట్​ చేశారు. నిందితులను నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని అధికారులు తెలిపారు.

దీనిని కూడా చదవండి : Ramya Rao Allegations | చెప్పులు లేని సంతోష్​ రావుకు వేల కోట్లు ఎలా వచ్చాయి?.. కేటీఆర్‌‌కు రమ్యరావు ప్రశ్న

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *