Hyderabad Water Supply | తాగునీటి సంరక్షణకు జలమండలి కఠిన చర్యలు

తాగునీటి సంరక్షణకు జలమండలి కఠిన చర్యలు చేపడుతుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Water Supply | తాగునీటి సంరక్షణకు జలమండలి (HMWSSB) కఠిన చర్యలు చేపడుతుంది. నీటిని వృథా చేస్తున్న వారికి భారీగా జరిమానాలు విధిస్తోంది. మరోవైపు అక్రమంగా మోటార్లు పెట్టి నీటిని ఎక్కువగా వినియోగిస్తున్న వారిపై సైతం చర్యలు తీసుకుంటుంది.

ప్రస్తుతం జలాశయాల్లో నీటిమట్టాలు పడిపోయాయి. దీంతో హైదరాబాద్​ నగరంలో డిసెంబర్​ నుంచి తాగునీటికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఇప్పటి నుంచే ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరుతున్నారు. వృథా చేయొద్దని చెబుతున్నారు. అయినా కొంత మంది పట్టించుకోవడం లేదు. అలాంటి వారిపై అధికారులు కొరఢా ఝుళిపిస్తున్నారు.

Hyderabad Water Supply | 13 మోటార్లు స్వాధీనం

తాగునీటి సరఫరా పైపులైన్లకు అక్రమంగా మోటార్లు బిగించి నీటిని తోడుకుంటున్న వారిపై జలమండలి విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. బుధవారం షంషాబాద్ జోన్ పరిధిలోని కొత్వాల్ గూడ, ఆర్‌బీ నగర్‌లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. నల్లాలకు పెట్టిన 13 మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. తాగునీటి పైపులైన్లకు మోటార్లు పెడితే.. ఇతర వినియోగదారులకు సరిపడా నీరు అందదని అధికారులు తెలిపారు. అక్రమ మోటార్ల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

Hyderabad Water Supply | నీటివృథా.. రూ.5 వేల ఫైన్​

జూబ్లీహిల్స్ వార్డు పరిధిలోని రోడ్ నంబర్ 57 ఇంటి ప్రాంగణం శుభ్రపరిచేందుకు తాగునీటిని వ వినియోగిస్తున్నట్లు స్థానికులు బుధవారం జలమండలి వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. నీరు వృథా చేస్తున్నట్లు గుర్తించి ఆ ఇంటి యజమానికి రూ.5 వేల జరిమానా విధించారు. తాగునీటిని తాగడానికి, గృహ అవసరాలకు మాత్రమే పొదుపుగా వినియోగించాలని సూచించారు. ఇంటి ఆవరణ, వాహనాలు, రోడ్లు శుభ్రం చేయడానికి తాగునీరు వాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

దీనిని కూడా చదవండి : ACB Raid | పెట్రోల్​ బంక్​ వెరిఫికేషన్​ సర్టిఫికెట్ కోసం లంచం డిమాండ్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *