ORR Accident | ఔటర్​ రింగ్​ రోడ్డుపై ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ORR Accident | హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. 19 మంది గాయపడ్డారు.

మొయినాబాద్​కు చెందిన కొందరు కూలీలు శంషాబాద్ ముచ్చింతల్ ప్రాంతంలో చెట్లు నాటే కార్యక్రమానికి వెళ్లారు. శనివారం పనులు ముగించుకొని రాత్రి తిరిగి మొయినాబాద్ ట్రాలీ ఆటోలో బయలు దేరారు. అయితే వీరి ఆటో అప్పా జంక్షన్ వద్ద ముందు వెళ్తున్న టిప్పర్‌ను వెనుక నుంచి ఢీకొంది. అనంతరం బోల్తా పడింది. శనివారం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ORR Accident | ఆటోలో 23 మంది

ప్రమాద సమయంలో ఆటోలో 23 మంది ఉన్నారు. అయితే ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 19మందికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులను సురేశ్​, పెంటయ్య, లింగరాజుశెట్టిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పండుగ పూట ముగ్గురి మృతి ఆ గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

దీనిని కూడా చదవండి : Bengaluru Airport Jobs | బెంగళూరు ఎయిర్‌పోర్ట్ ఉద్యోగాల్లో కన్నడిగులకే ప్రాధాన్యం : సంస్థ కీలక ప్రకటన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *