Vaishnavi Husband Murder Case | యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో సంచలన ట్విస్ట్.. తానే చంపానంటూ వైష్ణవి సోదరుడి వీడియో రిలీజ్!

కోరుట్లలో లొంగిపోయిన సంతోష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Vaishnavi Husband Murder Case | ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ హత్య కేసులో సరికొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. హరిబాబును తానే హత్య చేసినట్లు వైష్ణవి సోదరుడు సంతోష్ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ బహిరంగంగా అంగీకరించాడు.

Vaishnavi Husband Murder Case | “నా చెల్లిని చంపినవాడిని వదల్లేదు!”

హరిబాబు హత్య అనంతరం సంతోష్ సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. “నా చెల్లిని చంపినవాడిని నేనే చంపేశాను. నా చెల్లి వైష్ణవికి జరిగిన ఘోరం, అన్యాయం సమాజంలో మరే ఆడబిడ్డకు జరగకూడదు” అని ఆ వీడియోలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.

Harvard Courses in Hyderabad | డిసెంబర్ నుంచి హైదరాబాద్‌లో హార్వర్డ్ ఎగ్జిక్యూటివ్ కోర్సులు : సీఎం రేవంత్​

Vaishnavi Husband Murder Case | పోలీసుల ఎదుట లొంగుబాటు

హరిబాబును అంతమొందించిన తర్వాత తాను నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్తున్నానని, పోలీసులకు లొంగిపోతున్నట్లు సంతోష్ తెలిపాడు. యూట్యూబర్ వైష్ణవి మృతి ఘటన తర్వాత ఆమె కుటుంబ సభ్యులు, భర్త హరిబాబు మధ్య తీవ్ర వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే పగ పెంచుకున్న వైష్ణవి సోదరుడు సంతోష్ ఈ హత్యకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం.

వీడియో వైరల్ కావడంతో అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు. కోరుట్లలో లొంగిపోయిన సంతోష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ హత్య వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

akshara today .jpgharibabu

సంతోష్​ భార్య సెల్ఫీ వీడియో…

కాగా, నిందితుడు సంతోష్ భార్య కూడా ఒక వీడియో విడుదల చేశారు. గతేడాది ఇదే రోజు (సెప్టెంబరు 17) చిట్టి (వైష్ణవి) హత్యకు గురైన విషయాన్ని గుర్తుచేశారు. వైష్ణవి భర్త హరిబాబు హత్యతో తన చిట్టికి న్యాయం జరిగిందని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *