అక్షరటుడే, వెబ్డెస్క్: Ashirwada Deepam Nizamabad | నిజామాబాద్ నగరంలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ‘ఆశీర్వాద దీపం’ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళా మోర్చా నాయకులు, స్థానిక కార్పొరేటర్లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Ashirwada Deepam Nizamabad | ఉత్సాహంగా పాల్గొన్న నాయకులు
ఈ ‘ఆశీర్వాద దీపం’ కార్యక్రమంలో మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మారెడ్డి అనిత, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దాంపల్లి జ్యోతి, 34వ డివిజన్ కార్పొరేటర్ బంటు ప్రీతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో శైలజ, రాజేశ్వరి, జ్యోతి, వనిత, పంచారెడ్డి అనిత తదితరులు పాల్గొన్నారు.