అక్షరటుడే, కామారెడ్డి: Firecracker Shop Short Circuit | పటాకుల దుకాణ సముదాయంలో శనివారం రాత్రి షార్ట్ సర్క్యూట్ చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ఘటన కామారెడ్డి (Kamareddy) డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సముదాయంలో చోటు చేసుకుంది.
Firecracker Shop Short Circuit | రెండు దుకాణాల్లో..
రెండు దుకాణాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారం నెలకొంది. ఆ సమయంలో దుకాణాల వద్ద కొనుగోలుదారులు, చిన్న పిల్లలు, మహిళలు పెద్ద సంఖ్యలో ఉండటంతో అంతా భయాందోళనకు గురయ్యారు. షార్ట్ సర్క్యూట్తో నిప్పు రవ్వలు చెలరేగుతాయేమోనన్న భయపడ్డారు. అదృష్టవశాత్తూ పెను ప్రమాదం తప్పడంతో జనాలు, దుకాణాల నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు.
Firecracker Shop Short Circuit | ఫైరింజన్ వచ్చేందుకు సైతం ఇబ్బందులు.
మైదానం చుట్టూ టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేయడంతో ఫైర్ ఇంజిన్ రావడానికి సైతం ఇబ్బందులు ఎదురయ్యాయి. దుకాణాల మధ్య తగినంత ఖాళీ స్థలం ఉన్నప్పటికీ, వాహనాలు వెళ్లేందుకు ప్రత్యేక దారి లేకపోవడంతో ఫైర్ ఇంజిన్ మైదానంలోకి రాకుండానే వెళ్లిపోయిందని స్థానికులు చెబుతున్నారు. ఒకవేళ ఆ సమయంలో అగ్ని ప్రమాదం జరిగి ఉంటే పరిస్థితి ఏమయ్యేదో తలచుకుంటేనే భయం వేస్తోందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Firecracker Shop Short Circuit | అరకొర వసతుల మధ్యే..
అరకొర వసతుల మధ్యనే దుకాణాలకు అనుమతులు ఇచ్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దుకాణాల ఏర్పాటుకు ముందే విద్యుత్ వైరింగ్, అగ్నిమాపక పరికరాలు, ఇసుక బస్తాలు, నీటి సౌకర్యం, అత్యవసర దారి వంటి కనీస సౌకర్యాలు కల్పించాల్సి ఉండగా, వాటిని పట్టించుకోలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రతి దుకాణం వద్ద డబ్బులు వసూలు చేశారని, కానీ సౌకర్యాల కల్పనలో మాత్రం నిర్లక్ష్యం చేశారని వ్యాపారులు చెబుతున్నారు. ప్రమాదాలు జరగకుండా సౌకర్యాలు కల్పించడంలో నిర్వాహకులు విఫలమయ్యారని ప్రచారం సాగుతోంది.
పటాకుల దుకాణాల వద్ద తగిన ముందు జాగ్రత్త చర్యలు, అగ్నిమాపక సౌకర్యాలు, అత్యవసర వాహనాలు వెళ్లేందుకు దారి ఏర్పాటు చేయాలని వ్యాపారులు, ప్రజలు కోరుతున్నారు. విద్యుత్ కనెక్షన్లను వెంటనే తనిఖీ చేయించి, లోపాలను సరిచేయాలని, దుకాణాల మధ్య దూరం పాటించేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రమాద Y చర్యలు చేపట్టకపోతే భారీ నష్టం జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డి కి హరీష్ రావు కౌంటర్…