Hyderabad Heavy Rain | హైదరాబాద్​లో భారీ వర్షం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Heavy Rain | హైదరాబాద్​ నగరంలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. సాయంత్రం వరకు ఉక్కపోతగా ఉన్న వాతావరణం సాయంత్రం వానతో చల్లబడింది.

హైదరాబాద్ (Hyderabad)​ నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం నుంచి వర్షం కురిసంది. నగర శివారులోని సంగారెడ్డి (Sangareddy) జిల్లా ఇస్నాపూర్‌లో గాలివాన బీభత్సం సృష్టించింది. రుద్రారం, కంది, సంగారెడ్డి పట్టణం మరియు శంకర్‌పల్లి ప్రాంతాల్లో వర్షం కురిసింది. మేడ్చల్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, బాచుపల్లి, మల్లంపేట, నిజాంపేట, పటాన్‌చెరు, మియాపూర్, బీరంగూడ, అమీన్‌పూర్ ప్రాంతాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురిశాయి.

Hyderabad Heavy Rain | మిగతా జిల్లాల్లో..

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. కామారెడ్డి, మెదక్​ (Medak), సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో గాలివానతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయింది. గాలులు వీయడంతో ధాన్యం రాశులపై కప్పిన టార్పాలిన్లు కొట్టుకుపోయాయి. నారాయణపేట, గద్వాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో సైతం వాన పడింది.

 

దీనిని కూడా చదవండి : Telangana Employee SR Digitization | ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్ల డిజిటలైజేషన్.. ఉత్తర్వులు జారీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *