అక్షరటుడే, వెబ్‌డెస్క్: Simhachalam Giri Pradakshina | ఆషాఢ మాస పౌర్ణమి Pournami హిందూ Hundu ధర్మంలో అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో ఒకటి. ఈ రోజును గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమిగా భక్తులు విశేష భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు.
జ్ఞానానికి మార్గదర్శకులైన గురువులకు కృతజ్ఞతలు అర్పించే ఈ పుణ్యదినం, శ్రీమహావిష్ణువు అనుగ్రహాన్ని పొందేందుకు కూడా విశేషమైన సందర్భంగా భావిస్తారు. 2026 సంవత్సరంలో గురు పౌర్ణమి జులై 29వ తేదీ (బుధవారం) జరగనుంది.
Simhachalam Giri Pradakshina | భక్తి పారవశ్యంలో నరసింహ క్షేత్రం..
ఈ పవిత్ర సందర్భంలో విశాఖపట్నంలోని ప్రసిద్ధ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రమైన సింహాచలం భక్తజన సందోహంతో కళకళలాడుతుంది. ఏటా గురు పౌర్ణమి సందర్భంగా నిర్వహించే సింహాచలం గిరి ప్రదక్షిణలో లక్షలాది మంది భక్తులు పాల్గొని తమ భక్తి విశ్వాసాలను చాటుకుంటారు. ఇది కేవలం కాలినడక యాత్ర మాత్రమే కాదు.. ఆత్మను ఆధ్యాత్మికత వైపు నడిపించే ఓ మహా సాధనగా భక్తులు విశ్వసిస్తారు.
Simhachalam Giri Pradakshina | 32 కిలోమీటర్ల మేర…
సుమారు 32 కిలోమీటర్ల మేర సాగే ఈ గిరి ప్రదక్షిణ సాధారణంగా మధ్యాహ్నం ప్రారంభమై రాత్రంతా కొనసాగుతుంది. భక్తులు భజనలు, గోవింద నామస్మరణలు, నరసింహ నామజపాలతో అడుగులు వేస్తూ మరుసటి రోజు ఉదయం స్వామివారి దివ్య దర్శనంతో తమ యాత్రను సంపూర్ణం చేసుకుంటారు.
Simhachalam Giri Pradakshina | మొత్తం ప్రదక్షిణను పూర్తి చేయడానికి ..
ఈ పవిత్ర మార్గం తొలి పావంచా నుంచి ప్రారంభమై అడవివరం, హనుమంతవాక, మాధవధార, గోపాలపట్నం వంటి ప్రాంతాల మీదుగా తిరిగి సింహాచలం చేరుతుంది.
మొత్తం ప్రదక్షిణను పూర్తి చేయడానికి సాధారణంగా 8 నుంచి 10 గంటల సమయం పడుతుంది. యాత్రలో పాల్గొనే భక్తులు ప్రతి అడుగునూ భగవన్నామ స్మరణతో పుణ్యప్రదంగా భావిస్తారు.
గిరి ప్రదక్షిణను ఆచరించడం ద్వారా శారీరక శ్రమతో పాటు మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక చైతన్యం లభిస్తాయని భక్తుల విశ్వాసం. గురు పౌర్ణమి పవిత్రత, సింహాచల క్షేత్ర మహిమ కలిసిన ఈ మహాయాత్ర ప్రతి సంవత్సరం వేలాదిమందిని కాదు, లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తూ భక్తి, విశ్వాసం, సంస్కృతికి ప్రతీకగా నిలుస్తోంది.