అక్షరటుడే వెబ్‌డెస్క్: Karur Stampede Case | కలకలం రేపిన కరూర్ రోడ్డు షో తొక్కిసలాట ఘటనలో తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలన్న నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు రద్దు చేయగా.. ఆ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
Karur Stampede Case | మధ్యంతర ఆదేశాలు జారీ..
కరూర్ తొక్కిసలాటలో మృతి చెందిన 41 మంది బాధితుల కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం ఉద్యోగ నియామక పత్రాలు అందజేసింది. అయితే ముందస్తు ఎంపిక విధానం లేకుండా ఇలా ఉద్యోగాలు ఇవ్వడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 16లకు విరుద్ధమంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిని విచారించిన హైకోర్టు.. ఉద్యోగాల మంజూరు ఉత్తర్వులను రద్దు చేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ కే వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.
Karur Stampede Case | సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు ..
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. “అదో పెద్ద దురదృష్టకరమైన తొక్కిసలాట ఘటన. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం పరిహారంతో పాటు ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. ఇలాంటి దురదృష్టకర సంఘటనల్లో కుటుంబంలో సంపాదించే వ్యక్తిని కోల్పోతే ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వకూడదా..? ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నించడానికి మీరెవరు?” అని పిటిషనర్ తరఫు న్యాయవాదులను ధర్మాసనం ప్రశ్నించింది. సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులతో బాధితుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు దక్కే మార్గం సుగమమైంది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ నిమిత్తం సంబంధిత పక్షాలకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
–> కరూర్ బాధితులకు సుప్రీంకోర్టులో ఊరట
–> బాధితులకు టీవీకే ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు చెల్లవంటూ మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు
–> మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే
–> కరూర్ బాధితులకు ఇచ్చిన ఉద్యోగాలు కొనసాగించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలు
–> సుప్రీంకోర్టు… pic.twitter.com/VwnRG2ylTH
— RTV (@RTVnewsnetwork) August 14, 2026
ఇది కూడా చదవండి: PM Modi | దేశ విభజనతో.. ఎన్నో జీవితాలు ఛిన్నాభిన్నం : ప్రధాని మోదీ