Oct 19 Market Analysis | నష్టాల్లో ఆసియా మార్కెట్లు.. గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. మన మార్కెట్లు మాత్రం పాజిటివ్ గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Oct 19 Market Analysis | త్రైమాసిక ఫలితాలు, ఏఐ (AI)కి అవసరమైన భారీ నిధులపై నెలకొన్న ఆందోళన ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీయడంతో గత వారం టెక్నాలజీ ఆధారిత స్టాక్స్, సూచీలు భారీగా నష్టపోయాయి.

ప్రధానంగా నాస్‌డాక్ (Nasdaq) జూన్ తర్వాత అత్యంత భారీ నష్టాలను నమోదు చేసింది. ఏఐ AI స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి, అధిక చమురు ధరల ప్రభావంతో గత సెషన్‌లో వాల్ స్ట్రీట్ సైతం కుప్పకూలింది.

దీని ప్రభావంతో సోమవారం ఆసియా మార్కెట్లు నష్టాలతో కొనసాగుతున్నాయి. కాగా US ఫ్యూచర్స్ మాత్రం లాభాలతో ఉన్నాయి. కంపెనీల త్రైమాసిక ఫలితాలు అంచనాలకన్నా మెరుగ్గా ఉండడం, రష్యన్ ఆయిల్ కొనుగోలు విషయంలో అమెరికా ఆంక్షలను సడలించిన నేపథ్యంలో మన మార్కెట్లు ఫ్లాట్ టు గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Oct 19 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

గత సెషన్‌లో నాస్‌డాక్ 2.15 శాతం, ఎస్ అండ్ పీ 1.09 శాతం నష్టపోగా.. సోమవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.41 శాతం లాభంతో ఉంది.

Oct 19 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.94 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.28 శాతం పెరగ్గా.. యూకేకు చెందిన ఎఫ్టీఎస్ ఈ ఫ్లాట్‌గా ముగిశాయి.

Oct 19 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాలతో ఉన్నాయి. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.51 శాతం లాభంతో ఉండగా.. తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.89 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 1.12 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.31 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 0.23 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.03 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.15 శాతం లాభంతో ఉండడంతో మన మార్కెట్లు ఫ్లాట్ టు గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

గమనించాల్సిన అంశాలు..

  • విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు 15 సెషన్ తర్వాత నికర కొనుగోలుదారులుగా నిలిచారు. గత సెషన్‌లో నికరంగా రూ. 1,165 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
  • డీఐఐలు వరుసగా 46 సెషన్ల తర్వాత నికర అమ్మకందారులుగా మారారు. గత సెషన్‌లో నికరంగా రూ. 3,661 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 10 పైసలు బలపడి 94.96 వద్ద ఉంది.
  • క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 107.79 డాలర్ల వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 101.79 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 5.06 శాతం వద్ద ఉంది.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.37 నుంచి 1.21కు తగ్గింది. విక్స్ 14.02 వద్ద ఉంది.
Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *