అక్షరటుడే, వెబ్‌డెస్క్: Tirumala Navaratri Brahmotsavams | తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను గతంలో నిర్వహించిన సాలకట్ల బ్రహ్మోత్సవాల స్ఫూర్తితో మరింత ఘనంగా నిర్వహించాలని టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి ఉద్యోగులకు సూచించారు. అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.
Tirumala Navaratri Brahmotsavams | శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల స్ఫూర్తితో..
నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో విధులు కేటాయించిన టీటీడీ ఉద్యోగులతో శుక్రవారం సాయంత్రం తిరుమలలోని ఆస్థాన మండపంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకయ్య చౌదరి మాట్లాడుతూ.. సెప్టెంబరులో నిర్వహించిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అధికారుల సమన్వయం, ఉద్యోగుల సమష్టి కృషితో విజయవంతమయ్యాయని తెలిపారు. ఆ విజయానికి ప్రతి ఉద్యోగి కృషి కారణమని పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో నవరాత్రి బ్రహ్మోత్సవాలను కూడా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Tirumala Navaratri Brahmotsavams | సమష్టి కృషితోనే విజయవంతం
జేఈఓ డాక్టర్ శరత్ మాట్లాడుతూ.. గత బ్రహ్మోత్సవాల సమయంలో అధికారులు, సిబ్బంది బృంద స్ఫూర్తితో పనిచేయడం వల్ల కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయని చెప్పారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లోనూ ఇదే సమన్వయాన్ని కొనసాగిస్తూ తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని సూచించారు.

Tirumala Navaratri Brahmotsavams | భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం
టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణ మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల భద్రత అత్యంత కీలకమని స్పష్టం చేశారు. మాడ వీధులతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ భద్రతా సిబ్బంది ఇచ్చే సూచనలను ఉద్యోగులు తప్పనిసరిగా పాటించాలని కోరారు.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్సులు సులభంగా వెళ్లేందుకు వీలుగా అవసరమైన గేట్లను తెరిచి ఉంచే విషయంలో ఉద్యోగులు, శ్రీవారి సేవకులు సహకరించాలని టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో జేఈఓ (విద్య, వైద్యం) గోపీనాథ్‌తో పాటు వివిధ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.