Amarnath Yatra Bus | జమ్మూకశ్మీర్‌లో అమర్‌నాథ్ యాత్రికుల బస్సు బోల్తా.. 39 మందికి గాయాలు

జమ్మూకశ్మీర్‌లో అమర్‌నాథ్ యాత్ర నుంచి తిరిగి వస్తున్న ప్రయాణికుల బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది.

Shivam nagarani

అక్షరటుడే, వెబ్‌డెస్క్: Amarnath Yatra Bus | జమ్మూకశ్మీర్‌లో అమర్‌నాథ్ యాత్ర నుంచి తిరిగి వస్తున్న ప్రయాణికుల బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. గాందర్‌బల్ జిల్లా కంగన్ ( Kangan )ప్రాంతం సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో 39 మంది యాత్రికులు గాయపడ్డారు. కంగన్ దగ్గరలోని రోడ్డు మలుపు వద్ద డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో అది అదుపుతప్పి పక్కనే ఉన్న ఒక ఇంటిపై పడింది. అయితే, ఆ సమయంలో ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అంతేకాకుండా, బస్సు నేరుగా సింధు నదిలోకి పడిపోకుండా ఆ ఇంటిపై పడటం వల్లే ఆగిపోయిందని, దీనివల్ల భారీ ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. గాయపడిన యాత్రికులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు.

Amarnath Yatra Bus | అమర్‌నాథ్ యాత్ర విశేషాలు..

జులై 3న ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర ఆగస్టు 28 వరకు కొనసాగనుంది. సోమవారం నాటికి అమర్‌నాథ్‌లో పూజలు నిర్వహించిన భక్తుల సంఖ్య 4.22 లక్షలు దాటింది. తాజాగా 3,029 మందితో కూడిన కొత్త యాత్రికుల బృందం మంగళవారం తెల్లవారుజామున జమ్ము నుంచి అమర్‌నాథ్ యాత్రకు బయలుదేరి వెళ్లంది.

ఇది కూడా చదవండి: Meta Apologizes | పీఎం మోదీ వీడియో నిలిపివేత.. క్షమాపణ చెప్పిన మెటా

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *