Tata EV Offers | టాటా ఈవీలపై భారీ ఆఫర్లు..

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tata EV Offers | దేశీయ ఆటోమొబైల్ రంగ దిగ్గజ సంస్థ టాటా మోటర్స్ (Tata Motors) ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌పై పట్టు పెంచుకునేందుకు ఆకర్షణీయమైన ఆఫర్లతో ముందుకొచ్చింది. జూన్ నెల ఆఫర్లను ప్రకటించింది.

ఎంపిక చేసిన మోడళ్లపై గ్రీన్ బోనస్‌లు, ఎక్స్చేంజ్ బెనిఫిట్స్, స్క్రాపేజ్ ప్రోత్సాహకాలు, లాయల్టీ బోనస్‌ల రూపంలో ఈ ప్రయోజనాలు అందనున్నాయి. పాత స్టాక్‌తో పాటు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వేరియంట్లకూ ఈ ఆఫర్లు వర్తించనున్నాయి. ఈ ఆఫర్లు డీలర్ల వద్ద ఉన్న స్టాక్ లభ్యత, ప్రాంతం బట్టి మారతాయి. ఖచ్చితమైన ఆఫర్ వివరాల కోసం సమీపంలోని టాటా మోటార్స్ డీలర్‌ను సంప్రదించండి. టాటామోటార్స్ ప్రకటించి ఆఫర్లలో ఏ మోడల్‌పై ఎంత వరకు ప్రయోజనాలు పొందవచ్చో తెలుసుకుందామా..

Tata EV Offers | టాటా కర్వ్ ఈవీ..

టాటా ఈవీ పోర్ట్‌ఫోలియో నాన్ ఎక్స్ వేరియంట్లపై గరిష్టంగా రూ. 3.35 లక్షల వరకు ఆఫర్లు ప్రకటించింది. ఇందులో రూ.3 లక్షల గ్రీన్ బోనస్‌తో పాటు రూ.30 వేల ఎక్స్చేంజ్ బెనిఫిట్ లేదా రూ.35 వేల స్క్రాపేజ్ బెనిఫిట్ ఉంటుంది. క్రియేటివ్ వేరియంట్లపై రూ. 2.85 లక్షల వరకు, ఎక్స్ సిరీస్ వేరియంట్లపై ఎక్స్చేంజ్, స్క్రాపేజ్, లాయల్టీ బోనస్‌ల రూపంలో రూ. 65 వేల వరకు ప్రయోజనాలు పొందవచ్చు.

Tata EV Offers | టాటా హారియర్ ఈవీ..

ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ (Electric SUV) అయిన టాటా హారియర్ ఈవీ అన్ని వేరియంట్లపై రూ. 2.75 లక్షల వరకు ప్రయోజనాలున్నాయి. ఇందులో రూ.50 వేల ఎక్స్చేంజ్ బోనస్ లేదా రూ.75 వేల స్క్రాపేజ్ బెనిఫిట్ ఎంచుకోవచ్చు. దీంతోపాటు రూ. లక్ష లాయల్టీ బోనస్‌తో పాటు అదనంగా మరో రూ. లక్ష అదనపు ప్రయోజనం ఉంది.

Tata EV Offers | టాటా పంచ్ ఈవీ..

పంచ్ ఈవీ పాత వేరియంట్లపై రూ. 95 వేల నుంచి రూ. 1.45 లక్షల వరకు ఆఫర్లున్నాయి. లాంగ్ రేంజ్ (ఎల్ఆర్ ) వేరియంట్లకు గరిష్ఠంగా రూ.1.45 లక్షలు, మీడియం రేంజ్ (ఎంఆర్ ) వేరియంట్లకు రూ.1.25 లక్షల వరకు ప్రయోజనాలను టాటా మోటార్స్ ప్రకటించింది.

Tata EV Offers | టాటా టియాగో ఈవీ..

Tata EV Offers

అవుట్‌గోయింగ్ టియాగో ఈవీపై రూ. 65 వేల నుంచి రూ.1.45 లక్షల వరకు ప్రయోజనాలు పొందవచ్చు. టియాగో ఎల్ఆర్ ఎక్స్టీ వేరియంట్‌కు అదనపు బెనిఫిట్ రూ. 50 వేలు కలిపి అత్యధికంగా రూ.1.45 లక్షల వరకు ఆఫర్ ఉండగా.. ఇతర ఎల్ఆర్ వేరియంట్లకు రూ.1.25 లక్షలు, ఎంఆర్ వేరియంట్లకు రూ.65 వేల వరకు ప్రయోజనాలు అందనున్నాయి.

Tata EV Offers | టాటా నెక్సాన్ ఈవీ..

టాటా నెక్సాన్ ఈవీ శ్రేణిపై మొత్తం రూ.50 వేల వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో రూ. 15 వేల గ్రీన్ బోనస్‌తోపాటు రూ. 25 వేల ఎక్స్చేంజ్ ఆఫర్ లేదా రూ.35 వేల స్క్రాపేజ్ బెనిఫిట్ ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: Stock Market Losses | ముదురుతున్న పశ్చిమాసియా సంక్షోభం.. భారీ నష్టాల్లో మార్కెట్లు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *