అక్షరటుడే వెబ్‌డెస్క్: Delhi Car Bomb Case | గత సంవత్సరం నవంబర్‌లో ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన ఘోర కారు బాంబు పేలుడు ఘటనలో మరణించిన 11 మంది, అలాగే ఆత్మహుతి దాడికి పాల్పడినట్లు భావిస్తున్న డాక్టర్ ఉమర్ ఉన్ నబీ మృతదేహాల అవశేషాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టు ( Delhi high court )అనుమతించింది. ఈ మేరకు ప్రత్యేక న్యాయమూర్తి పీతాంబర్ దత్ ఉత్తర్వులు జారీ చేశారు.
Delhi Car Bomb Case | కోర్టు ఆదేశాలు..
మృతుల మత విశ్వాసాలకు అనుగుణంగా, పూర్తి గౌరవంతో అంత్యక్రియలు నిర్వహించాలని ఎన్‌ఐఏను కోర్టు ఆదేశించింది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే, దానికి సంబంధించిన నివేదికను కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది. కేసు దర్యాప్తులో భాగంగా మృతదేహాల నుంచి అవసరమైన ఫోరెన్సిక్ ఆధారాలన్నీ సేకరించినట్లు ఎన్‌ఐఏ కోర్టుకు వివరించింది. ప్రస్తుతం అవశేషాలు కుళ్లిపోతున్నందున, వాటిని మరింత కాలం భద్రపరచాల్సిన అవసరం లేదని కోర్టుకు విన్నవించగా, దీనికి న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది.
Delhi Car Bomb Case | కేసు నేపథ్యం..
2025, నవంబర్ 10న జరిగిన ఈ కారు బాంబు పేలుడు ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో దక్షిణ కాశ్మీర్‌కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఉమర్ ఉన్ నబీని ప్రధాన నిందితుడిగా ఎన్‌ఐఏ గుర్తించింది. విద్యావంతులతో కూడిన ఒక ఉగ్రవాద మాడ్యూల్ ఈ దాడికి కుట్ర పన్నిందని దర్యాప్తులో తేల్చింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 13 మందిపై ఛార్జ్‌షీట్లు దాఖలయ్యాయని, విస్తృత కుట్ర కోణంలో దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: BRS Blood Donation | సీఎం రేవంత్ రెడ్డికి రక్తదానం.. బీఆర్ఎస్ నిరసనతో తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత