Petrol Price Hike | త్వరలో పెట్రోలు ధరలు పెరుగుతాయి : రాహుల్​ గాంధీ

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Petrol Price Hike | కాంగ్రెస్​ అగ్రనేత, లోక్​సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్​ గాంధీ (Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపటి తర్వాత దేశంలో ఇంధన ధరలు పెరుగుతాయన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

ఎన్నికల ఉపశమనం ముగిసిందని, ద్రవ్యోల్బణం వేడి రాబోతోందని ఆయన అన్నారు. ఏప్రిల్ 29 తర్వాత పెట్రోల్, డీజిల్, ప్రతీదీ ఖరీదైపోతుందని పోస్ట్​లో పేర్కొన్నారు. చమురు చౌకగా ఉన్నప్పుడు మోదీ (Modi) ప్రభుత్వం లాభాలను జేబులో వేసుకుందని. ఇప్పుడు అది ఖరీదై, ఆ భారాన్ని ప్రజలపై మోపనుందని పేర్కొన్నారు. రేపటితో బెంగాల్ ఎన్నికలు (Bengal Elections) ముగియనున్నాయి. ఈ క్రమంలో రాహుల్​ గాంధీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Petrol Price Hike | ఖండించిన కేంద్రం

ఎన్నికలు ముగిశాక పెట్రోల్​ ధరలు పెరుగుతాయనే ప్రచారాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఇప్పట్లో ధరలు పెంచే ఆలోచన లేదని స్పష్టం చేసింది. అయినా కూడా రాహుల్​ గాంధీ ట్వీట్ చేయడం గమనార్హం. రేపు బెంగాల్​లో రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీకి నష్టం చేకూర్చేలా ఆయన ట్వీట్​ చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కాగా పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఇంధన నిల్వలకు సంబంధించి ఎలాంటి కొరత లేదని భరోసా ఇచ్చారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, భారత్‌లో పెట్రోల్, డీజిల్ నుంచి ఎల్పీజీ , విమాన ఇంధనం వరకు అన్నీ తగినంత స్థాయిలో ఉన్నాయని తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ఆలోచన ప్రస్తుతానికి లేదని స్పష్టం చేశారు.

 

ఇది కూడా చదవండి : SBI Bank Robbery | ఎస్బీఐలో భారీ దోపిడీ.. తుపాకీతో బెదిరించి రూ. 50 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *