అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Future City | ప్రపంచంతో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. మే నెలలో ఫ్యూచర్ సిటీ కార్యాలయం ప్రారంభిస్తామన్నారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవనానికి మంగళవారం ఆయన భూమిపూజ చేశారు.
ఫ్యూచర్ సిటీని అధునాతన నగరంగా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ సిటీ నిర్మాణం అంత సులభం కాదన్నారు. అందరం కలిసి పనిచేస్తే సాధ్యమవుతుందని చెప్పారు. ఫ్యూచర్ సిటీ కడతామంటే కొందరు ఏడుస్తున్నారని విమర్శించారు. అధికారం కోల్పోయిన బాధలో వాళ్లున్నారని ఎద్దేవా చేశారు. శుక్రాచార్యుడు ఫామ్‌హౌజ్‌లో పడుకున్నారని, మారీచుడు, సుబాహుడు జనంలో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.
Future City | వారికి న్యాయం చేస్తాం
ఫ్యూచర్ సిటీ విషయంలో కొంతమందికి కష్టం ఉందని సీఎం అన్నారు. సరైన నష్టపరిహారం రాలేదన్న బాధ కొందరి రైతుల్లో (Farmers) ఉందని అంగీకరించారు. వారందరికీ న్యాయం చేసేలా ఆలోచన చేస్తున్నామని తెలిపారు. భూములు కోల్పోతున్న వారు డబ్బులు తీసుకుని కొంచెం దూరంలో భూమి కొనుకోవచ్చన్నారు. పేదల విషయంలో అధికారులు మానవీయకోణంలో ఆలోచన చేయాలన్నారు.
Future City | బీఆర్ఎస్పై విమర్శలు
సింగపూర్ (Singapore), టోక్యో తరహాలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తామని సీఎం తెలిపారు. జూన్ 2 లోగా డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ప్రారంభించి మూడు బుల్లెట్ రైళ్లను తీసుకొస్తామని ప్రకటించారు. కొందరు ఫ్యూచర్ లేని నాయకుడు ఫ్యూచర్ సిటీ కడుతారా అని ఏడుస్తున్నారని బీఆర్ఎస్ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. వాళ్లు ఏడుస్తుంటే తనకు సంగీతం విన్నట్లు ఉంటుందన్నారు. వారి ఏడుస్తూ ఉన్నా.. తాను పనులు చేసుకుంటూ వెళ్తానని స్పష్టం చేశారు.
దీనిని కూడా చదవండి : SSC Results | విద్యార్థులకు అలెర్ట్.. వాట్సాప్‌లో పదో తరగతి ఫలితాలు

