May 14 Gold Rates | దిగుమతి సుంకాల ఎఫెక్ట్‌.. రికార్డు స్థాయికి బంగారం, వెండి ధరలు

Naresh Chandan

అక్షరటుడే, హైదరాబాద్: May 14 Gold Rates | దిగుమతి సుంకాల పెంపు నేపథ్యంలో దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు Silver Prices భగ్గుమన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల పెరుగుదలతో పాటు దిగుమతి వ్యయాలు అధికమవడంతో దేశీయ బులియన్ మార్కెట్‌లో రేట్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.

May 14 Gold Rates | పైపైకి ధ‌ర‌లు..

గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (మే 14) ఉదయం 6.30 గంటల సమయానికి హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,010గా నమోదైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర రూ.1,48,510గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.3,20,100లకు చేరింది. విజయవాడలో కూడా దాదాపు ఇదే స్థాయిలో ధరలు కొనసాగుతున్నాయి.

చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం ధర Gold Prices రూ.1,63,680గా ఉండగా.. 22 క్యారెట్ల ఆర్నమెంటల్ గోల్డ్ ధర రూ.1,50,010గా నమోదైంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం రూ.1,62,010గా, 22 క్యారెట్ల బంగారం రూ.1,48,510గా కొనసాగుతోంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,62,160గా ఉండగా.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,48,660లకు చేరింది. వెండి ధరలు కూడా భారీగా పెరిగి చెన్నైలో కిలోకు రూ.3,20,100ల గరిష్ఠ స్థాయిని తాకాయి. ఇతర ప్రధాన నగరాల్లో కూడా వెండి ధర రూ.3.10 లక్షలను దాటింది.

May 14 Gold Rates | గ్లోబల్ మార్కెట్‌లో

అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం ఔన్స్‌ (31.10 గ్రాములు) 24 క్యారెట్ల బంగారం ధర 4,690 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. ఔన్స్ వెండి ధర 87 డాలర్లకు చేరుకుంది. గ్లోబల్ మార్కెట్‌లో Global Market విలువైన లోహాల ధరలు పెరుగుతుండటంతో దేశీయ మార్కెట్‌పై కూడా తీవ్ర ప్రభావం పడుతోందని బులియన్ వ్యాపారులు చెబుతున్నారు.

Rabi Paddy Procurement | ముమ్మరంగా వరి కొనుగోళ్లు.. 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ.. రైతుల ఖాతాల్లో రూ.4,520 కోట్లు జమ!

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *