అక్షరటుడే, వెబ్డెస్క్ : TVK Minister | తమిళనాడులో అసెంబ్లీలో సోమవారం ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. టీవీకే మంత్రి సెంగోట్టయన్ మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఫొటోను జేబులో పెట్టుకొని ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.
TVK Minister | జయలలిత ఫొటో పెట్టుకొని ఎమ్మెల్యేగా ప్రమాణం
అసెంబ్లీ ఎన్నిక (Assembly elections)ల్లో టీవీకే 108 స్థానాలు గెలుపొందిన విషయం తెలిసిందే. మ్యాజిక్ ఫిగర్ దక్కకపోవడంతో ఆ పార్టీ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ముస్లీం లీగ్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు దళపతి విజయ్ ఆదివారం సీఎంగా ప్రమాణం చేయగా ఆయనతో పాటు 9 మంది మంత్రులు సైతం ప్రమాణ స్వీకారం చేశారు. అందులో సెంగోట్టయన్ కూడా ఉన్నారు. ఆయన తాజాగా జేబులో జయలలిత (Jayalalithaa) ఫొటో పెట్టుకొని ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. మరోవైపు స్టాలిన్ చిత్రంతో పన్నీర్ సెల్వం ప్రమాణం చేశారు.
TVK Minister | గతంలో ఏఐడీఎంకేలో..
సెంగోట్టయన్ గతంలో అన్నాడీఎంకేలో కొనసాగారు. 2025 నవంబర్లో ఆయన టీవీకేలో చేరారు. అన్నాడీఎంకేలో ఉన్న సమయంలో ఆయన జయలలిత మంత్రివర్గంలో పని చేశారు. ఈ క్రమంలో ఆమె మీద అభిమానంతో తాజాగా జేబులో ఫొటో పెట్టుకొని ప్రమాణం చేశారు. అయితే ప్రత్యర్థి పార్టీకి చెందిన నేత ఫొటోను జేబులో పెట్టుకోవడానికి విజయ్ (Vijay) అనుమతించడం విశేషం.
సెంగోట్టయన్ తొలిసారి 1977 ఎన్నికలలో సత్యమంగళం నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. గోబిచెట్టిపాళయం నియోజకవర్గం నుండి ఎనిమిదిసార్లు సహా, మొత్తం తొమ్మిదిసార్లు శాసనసభకు ఎన్నికై ఆయన ఒక రికార్డు సృష్టించారు. తమిళనాడు ప్రభుత్వంలో మంత్రిగా వివిధ శాఖలను నిర్వహించారు. జె. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1991 నుండి 1996 వరకు రవాణా మంత్రిగా, 2011లో వ్యవసాయ మంత్రిగా, 2011 నుండి 2012 వరకు సమాచార సాంకేతిక శాఖ మంత్రిగా, 2012లో రెవెన్యూ మంత్రిగా ఆయన సేవలందించారు. పళనిస్వామి మంత్రివర్గంలో మే 2017 నుంచి మే 2021 వరకు పాఠశాల విద్య, యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేశారు.
தனது சட்டை பாக்கெட்டில் ஜெயலலிதா படத்துடன் வந்து எம்.எல்.ஏ.வாக பதவியேற்ற செங்கோட்டையன் | Legislative Assembly | TN Assembly 2026 #CMVijay #CMJosephVijay #Sengottaiyan #EdappadiPalaniswami #TNAssembly #ADMK #TVK #DMK #TVKVijay #TNAssembly2026 #Newstamil24x7 pic.twitter.com/RcBuP1aESs
— News Tamil 24×7 (@NewsTamilTV24x7) May 11, 2026
ఇది కూడా చదవండి..: Himanta Biswa Sharma | అస్సాం సీఎంగా రేపు హిమంత బిస్వా శర్మ ప్రమాణ స్వీకారం

