Iran Israel Conflict | తక్షణమే ఇరాన్‌ను విడిచి వెళ్లండి.. భారత పౌరులకు ఎంబసీ హెచ్చరిక

పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం మళ్లీ తీవ్రరూపం దాల్చింది.

Shivam nagarani

అక్షరటుడే, వెబ్‌డెస్క్: Iran Israel Conflict | పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం మళ్లీ తీవ్రరూపం దాల్చింది. ఇరు దేశాలు  క్షిపణులతో దాడులు చేసుకుంటుండటంతో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని భారత ఎంబసీ (Indian Embassy) అక్కడి భారతీయుల భద్రతపై కీలక అడ్వైజరీ జారీ చేసింది.

Iran Israel Conflict | వెంటనే దేశం దాటాలని ఆదేశం..

ప్రస్తుత పరిస్థితులు అస్సలు బాలేవని, భారత పౌరులు ఎవరూ కూడా ఇరాన్‌కు ప్రయాణాలు పెట్టుకోవద్దని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే, ప్రస్తుతం ఇరాన్‌లో నివసిస్తున్న భారతీయులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా, అందుబాటులో ఉన్న విమానాలు లేదా ఇతర రవాణా మార్గాల ద్వారా తక్షణమే ఆ దేశాన్ని వీడి స్వదేశానికి వచ్చేయాలని భారత ఎంబసీ గట్టిగా హెచ్చరించింది.

Iran Israel Conflict | పెట్రో కెమికల్ ప్లాంట్‌పై ఇజ్రాయెల్ దాడి..

ఆదివారం అర్ధరాత్రి నుంచి ఇరు దేశాల మధ్య దాడులు సరికొత్త స్థాయికి చేరాయి. లెబనాన్‌పై జరిగిన దాడికి ప్రతీకారంగా ఇరాన్ విరుచుకుపడగా.. ఇజ్రాయెల్ కూడా అంతే బలంగా బదులిచ్చింది. ఇరాన్‌కు ఆర్థికంగా అత్యంత కీలకమైన ‘మషహర్ పెట్రోకెమికల్ ప్లాంట్’పై ఇజ్రాయెల్ సైన్యం బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో ఆ భారీ ప్లాంట్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఇజ్రాయెల్ మిలిటరీ అధికారికంగా ప్రకటించింది.

Iran Israel Conflict | ఇప్పటికే లక్షలాది మంది స్వదేశానికి..

ఈ సంవత్సరం ఫిబ్రవరి చివర్లో పశ్చిమాసియాలో ఘర్షణలు మొదలైనప్పటి నుంచి భారత ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. యుద్ధ క్షేత్రం నుంచి ఇప్పటికే 1600 మందికి పైగా భారతీయులను ప్రభుత్వం సురక్షితంగా తరలించింది. అంతేకాకుండా, గల్ఫ్ దేశాల్లో నెలకొన్న అలజడి కారణంగా ఇప్పటివరకు దాదాపు 6 లక్షల మంది భారత పౌరులు సురక్షితంగా సొంత దేశానికి చేరుకున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.

ఇది కూడా చదవండి:  Kishan Reddy Counter | సింగరేణిపై కేటీఆర్​కు కిషన్​రెడ్డి కౌంటర్​

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *