Aug 11 Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. నెగెటివ్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

గ్లోబల్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా సాగుతున్నాయి. మన మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయన్న సంకేతాన్ని గిఫ్ట్ నిఫ్టీ ఇస్తోంది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Aug 11 Market Analysis | హార్మూజ్ జలసంధి ద్వారా ఇంధన సరఫరా విషయంలో ఆందోళనలు పెరగడంతో గ్లోబల్ మార్కెట్లు(Global markets) మిశ్రమంగా ట్రేడయ్యాయి.

వాల్‌స్ట్రీట్ నష్టాలతో ముగియగా.. మంగళవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్ గా సాగుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ (Gift nifty) క్రితం ముగింపుతో పోలిస్తే డిస్కౌంట్‌తో ట్రేడ్ అవుతోంది. ఇది దేశీయ స్టాక్ మార్కెట్‌లోని ప్రధాన సూచీలు నెగెటివ్ గా ప్రారంభమవుతాయని సూచిస్తోంది.

Aug 11 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

గత సెషన్‌లో నాస్‌డాక్ 0.38 శాతం, ఎస్ అండ్ పీ 0.06 శాతం నష్టపోగా.. మంగళవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.06 శాతం నష్టంతో ఉంది.

Aug 11 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

యూకేకు చెందిన ఎఫ్టీఎస్ ఈ 0.36 శాతం నష్టపోగా.. ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.13 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.02 శాతం పెరిగాయి.

Aug 11 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 8.20 గంటల ప్రాంతంలో జపాన్‌కు చెందిన నిక్కీ 2.04 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 0.73 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.77 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.15 శాతం లాభంతో, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.47 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.08 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.14 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు నెగెటివ్ గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Colombia Earthquake | కొలంబియాను కుదిపేసిన శక్తివంతమైన భూకంపం.. 7.4 తీవ్రతతో ప్రకంపనలు.. 20 మంది దుర్మరణం

గమనించాల్సిన అంశాలు..

  • విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గత సెషన్‌లో నికరంగా రూ. 1,974 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • డీఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 1,290 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 9 పైసలు బలహీనపడి 95.30 వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 99.82 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.71 వద్ద ఉన్నాయి.
  • క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 87.87 డాలర్ల వద్ద ఉంది.
  • నిఫ్టీ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్‌పైరీ నేపథ్యంలో మార్కెట్‌లో ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.
Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *