Municipal Commissioner Suspension | సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ సస్పెన్షన్

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Municipal Commissioner Suspension | సిద్దిపేట (Siddipeta) మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్​ సస్పెండ్​ అయ్యారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ (Telangana Formation Day) ఏర్పాట్లలో నిర్లక్ష్యం వహించినందుకు కమిషనర్‌పై సస్పెన్షన్ వేటు వేస్తూ మున్సిపల్​ అడ్మినిస్ట్రేషన్​ డైరెక్టర్​ శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ హైమావతి (Collector Hymavati) ఫిర్యాదుతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

సిద్దిపేట మున్సిపల్​ కమిషనర్​ ఆశ్రిత్​ కుమార్​ తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా జిల్లా యంత్రాంగం జారీ చేసిన సూచనలను పాటించడంలో నిర్లక్ష్యం వహించారు. విధి నిర్వహణలో వైఫల్యం, అవిధేయత, చట్టబద్ధమైన విధులను నిర్వర్తించడంలో విఫలం అయ్యారని ఫిర్యాదులు అందాయి. దీంతో ఆయనను సస్పెండ్​ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Municipal Commissioner Suspension | ఏర్పాట్లు చేయకపోవడంతో..

సిద్దిపేటలో నిర్వహించిన ఆవిర్భావ వేడుకలకు మున్సిపల్ కమిషనర్​ అవసరమైన ఏర్పాట్లు చేయలేదు. సభాస్థలి వద్ద మున్సిపల్ సిబ్బంది హాజరును నిర్ధారించడంలో విఫలమయ్యారని, జాతీయ గీతం, తెలంగాణ రాష్ట్ర గీతం కోసం ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారని కలెక్టర్​ ఫిర్యాదు చేశారు. అధికారి ప్రవర్తన, పనితీరు అసంతృప్తికరంగా ఉన్నాయని, ఆయనపై క్రమశిక్షణా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని నివేదించారు. దీంతో ఆయనను సస్పెండ్​ చేసినట్లు డైరెక్టర్​ శ్రీదేవి తెలిపారు. సస్పెన్షన్ కాలంలో, అతనికి జీవన భృతి చెల్లిస్తారు. అనుమతి లేకుండా జిల్లా హెడ్​ క్వార్టర్స్​ దాటి బయటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు.

 

దీనిని కూడా చదవండి : Revanth Reddy Harvard Training | హార్వర్డ్​లో సీఎం శిక్షణపై ఎంపీ అర్వింద్​ కీలక వ్యాఖ్యలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *