నిజామాబాద్Fake Seeds | నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

Fake Seeds | నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

ఖరీఫ్ సీజన్​ను దృష్టిలో పెట్టుకుని జిల్లాలో నకిలీ విత్తనాలు చెలామణి కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు.

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Fake Seeds | ఖరీఫ్ సీజన్​ను దృష్టిలో పెట్టుకుని జిల్లాలో నకిలీ విత్తనాలు చలామణి కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్​లోని కాన్ఫరెన్స్ హాల్​లో సోమవారం వ్యవసాయ(Nizamabad Agriculture), ఉద్యానవన శాఖ అధికారులతో పాటు ఎరువులు విత్తనాల డీలర్లు, రైస్ మిల్లర్లతో(Rice Millers) కలెక్టర్ అవగాహన సదస్సు నిర్వహించారు.

Fake Seeds | విత్తనాలు అందుబాటులో ఉంచాలి

ఖరీఫ్ పంటల (Kharif Season) సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాల కొరత తలెత్తకుండా రైతులకు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. అయితే నకిలీ, నాసిరకం విత్తనాలతో రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా ప్రైవేట్ కంపెనీల ద్వారా మార్కెట్లో చలామణి అయ్యే అన్ని రకాల విత్తనాలను క్రమబద్దీకరించాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడ కూడా నకిలీ విత్తనాలు అనే పదం వినిపించకూడదని, ఈ విషయంలో అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలని అన్నారు. మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు నకిలీ విత్తనాల బెడద లేకుండా పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలన్నారు.

Fake Seeds | లైసెన్స్​లు రద్దు చేస్తాం

ఎవరైనా నకిలీ, నాసిరకం విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని, కేసులు నమోదు చేసి రికవరీ యాక్ట్(Recovery Act)​ అమలు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. డీలర్లను ఇబ్బంది పెట్టాలన్నది తమ అభిమతం కాదని, ఏ ఒక్క రైతు నకిలీ విత్తనాల వల్ల నష్టపోకూడదన్న సంకల్పంతో ఈ చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకొని తనిఖీకి వచ్చే అధికారులకు సహకరించాలని డీలర్లకు సూచించారు. జిల్లాకు వ్యవసాయ రంగంలో మంచి పేరు ఉందని, దానిని నిలుపుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు.

క్షేత్రస్థాయిలో ఎరువులు విత్తనాల దుకాణాలలో తనిఖీలు నిర్వహించిన వివరాలను నివేదిక రూపంలో తనకు ఎప్పటికప్పుడు సమర్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. క్రాప్ బుకింగ్ ఫార్మర్ రిజిస్ట్రీ (Crop Booking Farmer Registry) విషయంలోనూ ఖచ్చితత్వంతో వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. లేనిపక్షంలో పంట సేకరణ సమయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వ్యవసాయ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. సదస్సులో జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, డీఎస్​వో శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లయిస్​ డీఎం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

affi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ACB Raid | నాలా కన్వర్షన్​ కోసం రూ.30 లక్షల లంచం డిమాండ్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | మేడ్చల్ మల్కాజ్​గిరి జిల్లా...

భారత్‌లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు టుమారో మేకర్స్ కార్యక్రమాన్ని ప్రారంభించిన గోద్రేజ్ ఫౌండేషన్

వెనుకబడిన వర్గాల ప్రతిభావంతులైన యువతను ప్రోత్సహించేందుకు గోద్రేజ్ ఫౌండేషన్ సరికొత్త జాతీయ...

Bal Bhavan | చిన్నారుల ప్రతిభా ప్రదర్శనకు బాల్​భవన్​ చక్కని వేదిక

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Bal Bhavan | చిన్నారుల ప్రతిభా ప్రదర్శనకు...

Aaya Share Song | యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న నాని ‘ఆయా షేర్’ సాంగ్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Aaya Share Song | నేచురల్ స్టార్...