Tank Bund Ganesh Immersion | ట్యాంక్ బండ్ వద్ద ఉద్రిక్తత.. ఉత్సవ సమితి నేతల అరెస్ట్

హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద గణేష్ విగ్రహాల నిమజ్జన ఆంక్షలు తీవ్ర వివాదానికి, ఉద్రిక్తతకు దారితీశాయి.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Tank Bund Ganesh Immersion | హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద గణేష్ విగ్రహాల నిమజ్జన ఆంక్షలు తీవ్ర వివాదానికి, ఉద్రిక్తతకు దారితీశాయి. ట్యాంక్ బండ్‌లో నిమజ్జనాన్ని నిషేధించడాన్ని నిరసిస్తూ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు సోమవారం అక్కడ ఆందోళనకు దిగారు. అధికారులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించడంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు భారీగా మోహరించి, నిరసన తెలుపుతున్న ఉత్సవ కమిటీ నాయకులను అరెస్ట్ చేసి గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Tank Bund Ganesh Immersion | నిమజ్జనాలపై నిషేధం..

పర్యావరణ పరిరక్షణ, హుస్సేన్‌సాగర్ కాలుష్యాన్ని నివారించే లక్ష్యంతో ట్యాంక్ బండ్‌పై భారీ విగ్రహాల నిమజ్జనాన్ని అధికారులు పూర్తిగా నిషేధించారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (POP) విగ్రహాల వల్ల సరస్సు తీవ్రంగా కలుషితమవుతోందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నగరంలో పలుచోట్ల కృత్రిమ నిమజ్జన కొలనులను ఏర్పాటు చేశామని, చిన్న, మీడియం విగ్రహాలను వాటిలోనే నిమజ్జనం చేయాలని సూచించారు. ట్యాంక్ బండ్ వైపు నిమజ్జన వాహనాలను అనుమతించబోమని స్పష్టం చేస్తూ భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే ప్రభుత్వ ఈ నిర్ణయాన్ని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

Tank Bund Ganesh Immersion | బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం..

ఉత్సవ కమిటీ ప్రతినిధుల అరెస్ట్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. నాయకులను అరెస్ట్ చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. ప్రతి ఏటా ట్యాంక్ బండ్‌పైనే నిమజ్జనం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని, ఈసారి కూడా అక్కడ నిమజ్జనానికి ప్రభుత్వం అనుమతించాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి శశిధర్‌తో పాటు అరెస్ట్ చేసిన ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం వెంటనే బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వినాయక చవితి వేళ నెలకొన్న ఈ పరిణామాలు నగరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

ఇది కూడా చదవండి:  Jurala Project | జూరాల వద్ద ఉద్రిక్తత.. బీఆర్​ఎస్​ నాయకుల అరెస్ట్

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *