Mother Murder Case | తల్లి ప్రేమను కాలరాసిన కామం.. రూ.45 లక్షల కోసం అమ్మను బలితీసుకున్న కసాయి కూతురు!

Naresh Chandan
Mother Murder Case

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Mother Murder Case | ఏ బంధమైనా కాలక్రమేణా మారుతుందేమో కానీ, అమ్మ ప్రేమ మాత్రం ఎప్పటికీ నిశ్చలం. అల్లారుముద్దుగా పెంచి, పెంచి, ప్రయోజకురాలిని చేయాలనుకున్న ఆ తల్లికి.. తన కూతురే కాలయముడు అవుతుందని ఊహించలేకపోయింది.

Mother Murder Case | దత్త పుత్రిక

కేవలం డబ్బుపై ఆశతో, ప్రియుడి మోజులో పడి తల్లిని కిరాతకంగా చంపిన ఓ బాలిక ఉదంతం ఇప్పుడు సమాజం తలదించుకునేలా చేస్తోంది. Jharkhand రాంఛిలో వెలుగుచూసిన ఘటన ఇది. పిల్లలు లేక దత్తత తీసుకున్న నహీదా బేగం అనే మహిళను ఆ దత్త పుత్రికనే కడతేర్చింది.

కారణం ఏమిటంటే.. నహీదా భర్త చనిపోతే పరిహారంగా రూ. 45 లక్షలు వచ్చాయి. దీనికితోడు కారుణ్య నియామకం కింద కొలువు వచ్చింది. వీటిపై ఆ దత్తపుత్రిక కన్నేసింది. ఆ డబ్బు, కొలువు ఉంటే తన ప్రియుడు అబ్బాస్​తో జాలీగా ఎంజాయ్​ చేయొచ్చని భావించింది.

తల్లి బతికి ఉంటే ఆ డబ్బు రాదని, ఆమె చనిపోతేనే ఆ సొత్తు, ఉద్యోగం తన సొంతమవుతాయని భావించిన ఆ 17 ఏళ్ల బాలిక, తన ప్రియుడితో కలిసి మృగంలా ఆలోచించింది.

Mother Murder Case | ఖననం కూడా పూర్తి

అనాథను తీసుకొచ్చి పెంచిన తల్లి అన్న మమకారం కూడా లేకుండా, ప్రియుడితో కలిసి పథకం వేసి ఆమెను హతమార్చింది. ప్రాణాలు పోతున్న సమయంలో ఆ తల్లి పడిన వేదన వర్ణనాతీతం. “అమ్మా” అని పిలవాల్సిన నోరే కాలకూట విషం చిమ్మడాన్ని చూసి తట్టుకోలేక.. తనువు చాలించింది.

ఆ తర్వాత ఏమీ తెలియనట్టు నాటకమాడి తప్పించుకోవాలని చూసింది. తన తల్లి బాత్​రూంలో కాలుజారి పడి మరణించినట్లు నాటకమాడింది. ఖననం కూడా పూర్తి చేయించింది.

కానీ, మృతదేహంపై గాయాలను గుర్తించిన బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడటంతో స్థానికులు నివ్వెరపోయారు.

ఈ ఘటన కేవలం ఒక క్రైమ్ వార్త మాత్రమే కాదు.. కుప్పకూలుతున్న మానవ, కుటుంబ విలువలకు నిదర్శనం. ఆస్తి కోసం, అంతస్తు కోసం కన్నవారిని కాటికి పంపే ఇలాంటి వికృత చేష్టలు వింటుంటే సభ్య సమాజం విస్మయానికి గురవుతోంది.

తల్లి లేని జీవితం చీకటి అని ఆ బాలిక గ్రహించేసరికే కాలం దాటిపోయింది. ఇప్పుడు ఆ రూ. 45 లక్షలు లేవు, ప్రభుత్వ ఉద్యోగం రాదు.. మిగిలిందల్లా జీవితాంతం వెంటాడే నేరం, జైలుశిక్ష.

RTC Workers Issues | ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం : సీఎం రేవంత్​రెడ్డి

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *