health tips | పిల్లల ఆరోగ్యానికి వేసవి గైడ్.. ఈ సూచనలు పాటిస్తే ఆరోగ్యం మీ చెంతే!

admin

అక్షరటుడే, హైదరాబాద్: health tips | బాల్యానికి, వేసవి సెలవులకు విడదీయలేని అనుబంధం ఉంది. ఎండను సైతం లెక్కచేయకుండా ఆడుకోవడమే పిల్లలకు తెలుసు. అయితే, పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు చిన్నారుల లేత శరీరాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా డీహైడ్రేషన్ (నిర్జలీకరణం), మజిల్ క్రాంప్స్ (కండరాలు పట్టేయడం), వడదెబ్బ వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే ఈ కాలంలో పిల్లల ఆహారం, పానీయాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

health tips | తాగించాల్సిన పానీయాలు

నీటి శాతాన్ని పెంచేందుకు కేవలం మంచినీరు మాత్రమే కాకుండా, కొబ్బరినీళ్లు, మజ్జిగ, లస్సీ వంటివి తరచుగా ఇస్తుండాలి. నిమ్మరసం, బత్తాయి రసం, , ఇంట్లో తయారుచేసిన పండ్ల రసాలు పిల్లలకు తక్షణ శక్తిని ఇస్తాయి. రాగి జావ, వరి నూక జావ వంటివి శరీరానికి చలువ చేస్తాయి. బయట దొరికే ఐస్ కలిపిన చెరుకు రసం కంటే, ఐస్ లేని సహజ సిద్ధమైన పానీయాలు ఉత్తమం.

health tips | తినాల్సిన ఆహార పదార్థాలు

వేసవిలో ఘనాహారం కంటే ద్రవాహారం సులభంగా జీర్ణమవుతుంది. పుచ్చకాయ, దోసకాయ, మామిడి వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు , కూరగాయల సలాడ్స్ ఇవ్వాలి. వెజిటబుల్ సూప్‌లు లవణాల లోపాన్ని భర్తీ చేస్తాయి. గుడ్లు, పాలు వేడి చేస్తాయనేది అపోహ మాత్రమే. ఇవి శరీరానికి అవసరమైన విటమిన్లు, ప్రోటీన్లను అందిస్తాయి. చేపలు, పనీర్ వంటి తేలికపాటి ప్రోటీన్ ఆహారం కూడా మేలు చేస్తుంది.

health tips | రక్షణ సూచనలు

మధ్యాహ్నం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పిల్లలను బయటకు వెళ్లనివ్వకూడదు. ఎండలోకి వెళ్లాల్సి వస్తే లేత రంగు కాటన్ దుస్తులు, క్యాప్ ధరించేలా చూడాలి. శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీల ఫారెన్‌హీట్‌కు చేరితే అది ప్రమాదకరమని గుర్తించి వెంటనే చల్లటి గాలి సోకేలా చూడాలి. ప్లాస్టిక్ బాటిల్స్ కంటే గాజు లేదా స్టీల్ బాటిల్స్ వాడటం ఆరోగ్యకరం.

దూరంగా ఉంచాల్సినవి

అధిక ఉప్పు, కొవ్వులు ఉన్న ఆహార పదార్థాలు దాహాన్ని పెంచుతాయి. కెఫీన్ ఎక్కువగా ఉండే కాఫీ, టీ , కృత్రిమ రంగులు కలిగిన కూల్ డ్రింక్స్‌కు పిల్లలను దూరంగా ఉంచాలి. ప్రాసెస్ చేసిన మాంసం, నూనెలో వేయించిన పదార్థాలకు బదులుగా తాజా పండ్లు ఇవ్వడం శ్రేయస్కరం.

నివారణే మేలనే సూత్రాన్ని పాటిస్తూ, పిల్లలకు సరైన సమయానికి నీరు తాగిస్తూ, నీడపట్టున ఉంచడం ద్వారా ఈ వేసవిని సురక్షితంగా దాటవచ్చు.

ఇది కూడా చదవండి..: Singer Mangli | సింగర్ మంగ్లీని బహిష్కరించాలని ఫిర్యాదు

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *