జాబ్స్​ & ఎడ్యుకేషన్​TGPSC Notifications | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రేపే 3 కొత్త నోటిఫికేషన్లు

TGPSC Notifications | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రేపే 3 కొత్త నోటిఫికేషన్లు

తెలంగాణలోని ఉద్యోగార్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) చైర్మన్ బుర్రా వెంకటేశం అదిరిపోయే శుభవార్త చెప్పారు.

అక్షరటుడే వెబ్‌డెస్క్: TGPSC Notifications | తెలంగాణలోని ఉద్యోగార్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) చైర్మన్ బుర్రా వెంకటేశం అదిరిపోయే శుభవార్త చెప్పారు. ఉద్యోగాల భర్తీని వేగవంతం చేయడంతో పాటు, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ మొత్తాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, అభ్యర్థుల్లో నమ్మకం పెంచేలా కమిషన్ తీసుకోబోయే పలు కీలక నిర్ణయాలను వివరించారు.

TGPSC Notifications | నెలకు 3 నోటిఫికేషన్లు..

ప్రభుత్వం నుంచి ప్రస్తుతం 3,800 ఉద్యోగ ఖాళీల భర్తీకి అనుమతులు లభించాయని చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. ఇందులో అత్యధికంగా అటవీ శాఖలోనే 3,093 పోస్టులు ఉన్నాయని, సింగిల్ పోస్ట్ ఖాళీలు మరో 25 వరకు ఉన్నాయని చెప్పారు. ఇకపై నోటిఫికేషన్ల కోసం అభ్యర్థులు ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా.. ప్రతి నెల సగటున మూడు నోటిఫికేషన్లను నిరంతరాయంగా విడుదల చేస్తామన్నారు. ఈ కొత్త విధానానికి శ్రీకారం చుడుతూ రేపే (మంగళవారం) మూడు సరికొత్త నోటిఫికేషన్లను జారీ చేస్తున్నట్లు ప్రకటించారు.

tgpsc.2

TGPSC Notifications | ఏడాదిలోనే ప్రక్రియ పూర్తి..

ఏ నోటిఫికేషన్ ఇచ్చినా సరే, దరఖాస్తుల స్వీకరణ నుండి నియామకాల వరకు గరిష్టంగా సంవత్సరం లోపే ఆ ప్రాసెస్‌ను పూర్తి చేస్తామని చైర్మన్ హామీ ఇచ్చారు. అలాగే పరీక్షల్లో పారదర్శకత కోసం ఇకపై TGPSC నిర్వహించే అన్ని ఎగ్జామ్స్ పూర్తిగా కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ మోడ్ (CBRT) లోనే జరుగుతాయని స్పష్టం చేశారు. దీనివల్ల క్వశ్చన్ పేపర్లను ముందే ప్రింట్ చేసే పని ఉండదని, ఫలితంగా పేపర్ లీకేజీల సమస్యకు శాశ్వతంగా చెక్ పడుతుందని పేర్కొన్నారు. అభ్యర్థులు ఎగ్జామ్ రాసి బయటకు రాగానే.. తాము ఎన్ని ప్రశ్నలకు కరెక్ట్ ఆన్సర్స్ రాశామో వెంటనే తెలిసిపోయేలా సరికొత్త టెక్నాలజీని తెచ్చే ఆలోచనలో ఉన్నట్లు ఆయన హింట్ ఇచ్చారు.

tgpsc.1

TGPSC Notifications | వదంతులు నమ్మొద్దు..

నోటిఫికేషన్ ఇవ్వడం, ఎగ్జామ్స్ నిర్వహించడం, మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థులను పారదర్శకంగా ఎంపిక చేయడం అనే పక్కా విధానాన్ని ఫాలో అవుతామని బుర్రా వెంకటేశం చెప్పారు. అయితే, పరీక్ష రాసే వారిలో కేవలం 0.1 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయని, మిగిలిన 99.9 శాతం మందికి ఉద్యోగం రాకపోవడం సహజమేనని ఆయన గుర్తుచేశారు. జాబ్ రాని వారిలో కొందరు కమిషన్‌పై సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేసే అవకాశం ఉందని, అభ్యర్థులు అలాంటి వదంతులను అస్సలు నమ్మవద్దని కోరారు. ఏదేమైనా TGPSC తెస్తున్న ఈ సరికొత్త మార్పులు నిరుద్యోగుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

 

ఇది కూడా చదవండి:  Telangana Employee Transfers | తెలంగాణలో ఉద్యోగుల బదిలీలపై కఠిన ఆంక్షలు.. రూల్స్ బ్రేక్ చేస్తే జీతం కట్

Shivam nagarani
Shivam nagaranihttps://aksharatodaynews.com/
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

June 03 Horoscope | నేటి రాశి ఫలాలు.. సరికొత్త అవకాశాలతో దూసుకుపోయే వీరే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: June 03 Horoscope | గ్రహాల సంచారం వలన...

Germany Transit Visa | భారతీయులకు జర్మనీ బంపర్ ఆఫర్: ఇకపై ఎయిర్‌పోర్ట్ ట్రాన్సిట్ వీసా లేకుండానే..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Germany Transit Visa | అంతర్జాతీయ ప్రయాణాలు చేసే భారతీయులకు...

Super El Nino | భూగోళాన్ని భయపెడుతున్న ‘సూపర్ ఎల్ నినో’: భారత్​పై ఎలాంటి ప్రభావం చూపనుందంటే..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Super El Nino | ప్రపంచ వాతావరణాన్ని సమూలంగా...

Chain Snatcher Arrest | ఈ చైన్​ స్నాచర్ మామూలోడు కాదు సుమా​.. 180 కేసుల్లో నిందితుడు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Chain Snatcher Arrest | ఉభయ తెలుగు రాష్ట్రాల్లో...